(దండుగుల శ్రీనివాస్)
పుష్ప పాన్ ఇండియా సినిమాగా హిట్ అయ్యింది. అందరి నోటా ఇదే మాట. నిన్నటి వరకు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు ఇదో వేదికైంది. అల్లు అర్జున్ అందులో పాత్ర దారుడు. సినిమాలో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే క్రమంలో విలన్‌తో హీరో ఎత్తులు పై ఎత్తులు వేస్తూ చిత్తు చేస్తూ ప్రేక్షకులను కనువిందు చేసిన అల్లు అర్జున్… రియల్ హిరో కాలేకపోయాడు. విలన్‌గానే ముద్రపడిపోయాడు. సినీ ఇండస్ట్రీలో ముఖ్యంగా పవన్ కల్యాణ్, రాజేంద్రప్రసాద్‌లాంటి హీరోలు స్మగ్లింగ్ హీరోగా ముద్రవేశారు.
ఇప్పుడు ఇదంతా టాపిక్ ఎందుకంటే … ఓ థియేటర్‌లో అల్లు అర్జున్ సినిమా చూడటానికి పోతే… తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. దీనిపై తెలంగాణ సర్కార్ కొంచెం లేటుగా సీరియస్ అయ్యింది. అల్లు అర్వింద్‌ను అరెస్టు చేశారు. ఇదిప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అక్కడ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్‌లు అల్లుపై ఆగ్రహంతో ఉన్నారు.
ఇక్కడ సీఎం రేవంత్ వారికి మంచి దోస్తు. అందుకే అల్లు అరెస్టు ఇలా చకచకా జరిగిపోయిందంటున్నారు. మరోవైపు బీజేపీ సహా బీఆరెస్, అక్కడి వైఎస్సార్ సీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి .. తెలుగు రాష్ట్రాల సీఎంలను అర్సుకుంటున్నారు. మీరు మీరు ఒక్కటే . అందుకే అల్లు అర్జున్‌ను అరెస్టు చేయిస్తున్నారు. ఆయన పొరపాటేమీ లేదు. సినిమా చూడటానికి వెళ్లడమే పాపమా..? తగిన భద్రత కల్పించాలని పోలీసులకు లేఖ రాశాడుగా… మరెందుకు సర్కార్ పట్టించుకోలేదని సీఎం రేవంత్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇప్పుడు ఇది రెండు రాష్ట్రాల రాజకీయలకు కేంద్ర బిందువుగా మారింది. చంద్రబాబు చెబితే రేవంత్ విన్నాడని. రేవంత్ .. బాబు మాట విన్నాడు కాబట్టి దీన్ని ఎలాగైన బలంగా వ్యతిరేకించాలని బీజేపీ, బీరెస్, అక్కడి ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ… ఇలా మారింది. పుష్ప క్లైమాక్స్.