వాస్తవం ప్రధాన ప్రతినిధి- హైదరాబాద్:
అల్లు అర్జున్ అరెస్టుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించి పలుచనయ్యాడు. ఓవైపు ఈ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే పాత్ర పోషించిన అల్లు అర్జున్‌పై అక్కడి నటులే విమర్శలు చేస్తుండగా.. ఈ కేసులు తగుదునమ్మా అని బండి జోక్యం చేసుకోవడం అసందర్బం. అనాలోచితమేనని చెప్పాలి. థియేటర్‌లో తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన విషయంలో ఈ వివాదం ఇక్కడి వరకు వచ్చింది. అక్కడ ఆంధ్ర సర్కార్ పెద్దలంతా అల్లుపై గుర్రుగా ఉన్నారు.
దొరికింది చాన్స్ అని పుష్పని ఇరికించేశారు. ఇదంతా పొలిటికల్ డ్రామాగా మారింది. దీనిపై సీఎం కూడా స్పందించాడు. చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పాడు. కానీ ఇంతలా పోలీసులు అత్యుత్సాహం చూపడం వెనుక ఆంధ్ర సర్కార్ పెద్దల జోక్యం, ఒత్తిడి లేదని భావించలేం.
ఈ పొలిటికల్ గేమ్‌లో బండి జోక్యం చేసుకుని మాట్లాడటం ఆయన స్థాయి, పదవి స్థాయిని తగ్గించినట్టే అయ్యింది. ఎందుకంటే హీరో పాత్ర స్మగ్లింగ్ చేసే ఓ బ్లాక్‌మెయిలర్ పాత్ర. దీనిపై సినీ ఇండస్ట్రీలోనే విమర్శలున్నారు. అందులో తగుదునమ్మా అని వేలు పెట్టడం బండి అత్యుత్సాహమేనని అంటున్నారు పొలిటికల్ సర్కిళ్లలో.