(దండుగుల శ్రీనివాస్)
ఎప్పుడు పోదామా జైలుకు అని ఎదురుచూస్తున్నాడు.. కానీ పోవాలంటే భయం..! జైలుక పంపొద్దు.. పర్మిషన్ ఇవ్వొద్దని ఢిల్లీ ప్రదక్షిణలు చేస్తాడు. మోడీ ముందు మోకరిల్లుతాడు. గవర్నర్ అనుమతి రాకుండా అడ్డుకుంటాడు… కానీ జైలుకు పోతే గానీ సీఎం కారని ఎవరో చెప్పారట.. అందుకే పోతా పోతా అని ఉబలాటపడుతున్నాడు…..! కొంచెం అటూ ఇటూగా కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి అన్న మాటలివే. ఏదో పేపర్లో చూసినా.. జైలుకు పోయిన వాళ్లంతా సీఎంలు అయ్యారని… పాపం అందుకే కేటీఆర్ నన్ను అరెస్టు చెయ్.. జైలుకు పోతా అంటున్నాడు… అని ఎద్దేవా చేశారు. మరి ఆ మాటకొస్తే నీ చెల్లెనే ముందు పోయింది కదా..మరి ఆమెనే సీఎం కావాలె.. నీ ఇంట్ల పోరు పడక.. దిమాఖ్ ఖరాబయి ఏవేవో ఆలోచిస్తున్నాడు…అంటు చురకలేశాడు.
కవిత ఈ మధ్యే మళ్లీ బయటకు వచ్చింది. వచ్చీ రాగానే జాగృతి ని ముందేసుకున్నది. బీసీ రిజర్వేషన్ అంటూ .. ఏదో నెత్తికెత్తుకున్నది. వార్తల్లో మళ్లీ ఆమె ముఖం కనిపిస్తున్నది. ఇక కేటీఆర్ దూకుడు కూడా పెరిగింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పోరుందనే ప్రచారం అప్పట్నుంచీ ఉంది.. ఇప్పుడు రేవంత్ కూడా చెల్లె, అన్న ప్రస్తావన, జైలు జీవితం గురించి మాట్లాడేసరికి మళ్లీ వీరిద్దరి ఆధిపత్య పోరు గురించి చర్చ మొదలైంది. మొన్నటిదాకా కేటీయార్ ఒక్కడే అన్నీ తానై వ్యవహరిస్తూ వచ్చాడు. హరీశ్‌రావును అసవరానికి వాడుకున్నాడంతే. ఇప్పుడు చెల్లె బయటకు వచ్చింది. ఇక రాజకీయాలు షురూ అయ్యాయి. ఇంటిపోరు మళ్లీ మొదలైంది. ఇదే విషయాన్ని సీఎం ఇలా చెప్పారన్నమాట.
మాటిమాటికి ఢిల్లీ వెళ్తున్నారని అర్రాస్ లెక్క లెక్కలేస్తున్నాడు… మేమైనా కేసుల నుంచి తప్పించుకుంటందుకు ఢిల్లీకి పోతున్నామా.. అని కేటీఆర్‌నుద్దేశించి అన్న సీఎం.. ఎన్నిసార్లైనా పోతాం.. అక్కడ మా హక్కుగా ఏమేం రావాలో అన్నీ సాధిస్తాం… రావాల్సిన నిధులు, అనుమతులు తెచ్చుకుంటాం.. పదేండ్లు మీ వల్ల జరిగిన నష్టం, విధ్వంసాన్ని భర్తీ చేసేందుకు ఎన్నిసార్లైనా వెళ్తామని ముక్తాయించారు రేవంత్‌రెడ్డి.