వికారాబాద్ జిల్లాలో కలెక్టర్, రెవెన్యూ సిబ్బందిపై జరిగిన దాడి విషయంలో ఆ జిల్లా కలెక్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పై ఎలాంటి దాడి జరగలేదన్నారు. అంతా మనవాళ్లే .. మనమీద ఎందుకు దాడి చేస్తారు.. కొంత మంది అల్లరి మూకలు రెచ్చగొట్టాలని చూశారని, అందుకే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. కాగా ఈ సంఘటనలో ఇప్పటి వరకు 28 మందిని అరెస్టు చేయగా.. ఇంకా 120 మంది వరకు ఇందులో పాల్గొన్నారనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. వారి కోసం వేట మొదలైంది.
నాపై ఎవరూ దాడి చెయ్యలేదు : కలెక్టర్ ప్రతీక్ జైన్
పెన్ డౌన్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్..
తనపై ఎవరూ దాడి చేయలేదని స్పష్టం చేసిన కలెక్టర్..
మాట్లాడేందుకు గ్రామస్థులు పిలిచారని.. చర్చలు జరిపామని వెల్లడి..
ఇంతలో అల్లరి మూకలు హడావుడి చేశారని తెలిపిన కలెక్టర్..
అంతా మన రైతులు అని, మావాళ్లు మనపై దాడి చేయరని తెలిపిన కలెక్టర్..
ఘటనపై దర్యాప్తు జరుగుతోందని..ఎవరూ ఆందోళన చేయవద్దని సూచించిన కలెక్టర్.
వికారాబాద్
*లగచర్లలో నిన్న అధికారులపై దాడి ఘటనలో 28మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
*ఈ దాడిలో మొత్తం 120 మంది ఉన్నట్లు అనుమానం
*రైతులను,మహిళలను రెచ్చగొట్టి దాడి చేసేలా పురిగొల్పిన వ్యక్తులను గుర్తించే పనిలో పోలీసులు