వికారాబాద్ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్‌తో పాటు కడా ప్రత్యేక అధికారి ,కొండగల్ తహశీల్దార్ , ఇతర రెవిన్యూ సిబ్బంది పై దాడి హేయమైన చర్య అని ట్రెసా అధ్యక్షుడు వంగా రవిందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఫార్మా కంపెనీ భూసేకరణ ప్రక్రియలో భాగంగా గ్రామసభలో పాల్గొనడానికి వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్,అదనపు కలక్టర్ ,కడా ప్రత్యేక అధికారి , కొండగల్ తహశీల్దార్ , ఇతర రెవిన్యూ సిబ్బంది పై దాడిని ట్రెసా తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. ఇలాంటి హీనమైన చర్యల వల్ల ఉద్యోగులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
రెవిన్యూ అధికారులు,సిబ్బంది వికారాబాద్ జిల్లాలో జరిగిన దాడికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా విధులు బహిష్కరణ చేయాలని రవీందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రెవిన్యూ ఉద్యోగులందరు నల్లబాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని, నిరసన తెలపాలని నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు.