(దండుగుల శ్రీనివాస్)
కేటీఆర్ సెల్ప్‌గోల్ అయ్యాడు. డిఫెన్స్‌లో పడిపోయాడు. రేవంత్ వేసిన ప్రశ్నలకు, నిలదీతలకు అక్కడి నుంచి సమాధానం రాలేదు. కేటీఆర్ వేసిన ప్రశ్నలకు, ఆరోపణలకు మూతోడ్ జవాబ్ ఇచ్చాడు రేవంత్. వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై జరిగిన దాడి నేపథ్యంలో బీఆరెస్‌ను ఇరుకున పెట్టే విధంగా రేవంత్ తీవ్ర విమర్శలు చేశాడు. మీ హయాంలో అధికారులపై దాడులు జరిగితే ఇలాగే స్పందిస్తారా..? దాడులు చేసిన వారి వద్దకు వెళ్లి పరామర్శలు ఎలా చేస్తారు..? అంటే దాడులు ఇంకా చేయమని ప్రోత్సహిస్తున్నారా..? అని రేవంత్ వేసిన ప్రశ్నలకు కేటీఆర్ నుంచి నో ఆన్సర్. కలెక్టర్‌పై దాడి చేసిన వారినే కాదు.. చేయించిన వారినీ వదిలేది లేదని, అందరూ ఊచలు లెక్కించాల్సిందేనని ఘాటుగా స్పందించాడు సీఎం.
దీని వెనుక బీఆరెస్ కుట్రకోణం ఉందని ఇప్పటికే అన్ని వర్గాల నుంచి వస్తున్న ప్రచారం, పోలీసుల విచారణ నేపథ్యంలో బీఆరెస్ ఈ ఉదంతంలో దోషిగా నిలబడింది. అది దోషిగా నిలుచునేలా చేసింది సర్కార్. సీఎం రేవంత్ రెడ్డి. ఇక అమృత్ టెండర్ల విషయంలో సీఎం బావమరిది సృజన్ రెడ్డికి 1130 కోట్ల రూపాయల టెండర్లు ఇచ్చారని, ఇది పెద్ద స్కాం అని కేటీఆర్ ఏకంగా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల వద్ద మొర పెట్టుకోవడాన్నీ తీవ్రంగా ఆక్షేపించాడు రేవంత్. అంతే కాదు దీనిపై మూతోడ్ జవాబిచ్చాడు కేటీఆర్‌కు. అసలు ఈ సృజన్ ఎవడు..? వెనుక రెడ్డి అని ఉంటే అంతా నా చుట్టాలేనా..? మీ బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ అల్లుడే ఈ సృజన్ రెడ్డి.. అప్పుడు వేలాది కోట్ల టెండర్లిచ్చింది మీరు కాదా..? అని నిలదీయడంతో కేటీఆర్ సెక్షన్ కు చుక్కలు కనిపించాయి.
ఎక్కడ పిర్యాదు చేసుకుంటావో చేసుకో..! భయపడేదే లేదు. దీని వల్ల ఏమీ కాదు. ఫార్మూలా -ఈ కారు రేసు అవినీతి విషయంలో నిన్ను అరెస్టు చేయకుండా గవర్నర్ నుంచి అనుమతి రాకుండా ఉండేందుకు ఢిల్లీలో బీజేపీ పెద్దల వద్దకు వచ్చావని ఘాటు వ్యాఖ్యలు చేయడం కూడా కలకలం రేపింది. ఎట్టి పరిస్తితుల్లో నిన్ను వదిలేది లేదన్నాడు రేవంత్. దీంతో ఇటు వికారాబాద్‌లో జరిగిన ఉదంతం బీఆరెస్ పార్టీకి కలిసి వస్తుందని భావించి చంకలు గుద్దుకున్న కేటీఆర్‌కు అది తిరబడి ఎదురు తన్నగా…అమృత్ టెండర్ల అవినీతి బాగోతం అంటూ సీఎంను కట్టడి చేయాలని రచ్చ రాజకీయం చేసిన కేటీఆర్‌కు .. రేవంత్ నుంచి వచ్చిన పదునైన ఆన్సర్లు తూట్లు పొడిచాయి. మొత్తానికి ఈ రెండు సంఘటనల పట్ల రేవంత్ ఒకేసారి స్పందించిన తీరు కేటీఆర్‌ను సెల్ప్ డిఫెన్స్‌లో పడేశాయి. ఆ పార్టీకి మైలేజీ రాకపోగా.. మరింత మైనస్ అయి కూర్చింది. కేటీఆర్ అరెస్టు తథ్యం అనే సంకేతాలిచ్చింది.