మూసీని అందంగా
ముస్తాబు చేసేందుకు..
మొన్న..
50 వేల కోట్లు అయితదన్నరు
నిన్న..
70 వేల కోట్లు వెచ్చిస్తామన్నరు
నేడు..
లక్షా 50 వేల కోట్లు
ఖర్చు చేస్తామంటున్నరు
తెలంగాణ రైతుల తలరాతను మార్చిన
కాళేశ్వరం ప్రాజెక్టుకు 80 వేల కోట్లయితేనే
గల్లీ నుంచి ఢిల్లీదాకా గగ్గోలుపెట్టింది కాంగ్రెస్
మరి.. సుందరీకరణకే..
రూ.లక్షా యాభై వేల కోట్లా..!
పదిహేను పక్కన ఇన్ని సున్నాలా..!!
15,000,000,000,000
ఇంతకీ మూసీ ప్రాజెక్టుతో..
మురిసే రైతులెందురు..!
నిల్వ ఉంచే టీఎంసీలెన్ని..!
సాగులోకి వచ్చే ఎకరాలెన్ని..!!
పెరిగే పంటల దిగుబడి ఎంత..!!
తీర్చే పారిశ్రామిక అవసరాలెంత..!!!
కొత్తగా నిర్మించే భారీ రిజర్వాయర్లెన్ని..!!!
పుట్టిన గడ్డపై..
మమకారం లేని..
ముఖ్యమంత్రి గారికి..
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకన్నా..
మూసీ ప్రాజెక్టుపైనే ఎందుకింత మక్కువ ??
చివరిదశలో ఉన్న ప్రాజెక్టును
పక్కనపెట్టి.. కోల్డ్ స్టోరేజీలోకి నెట్టి
మూసీ చుట్టే ఎందుకింత మంత్రాంగం..??
లండన్ లోని థేమ్స్ లాగా మారుస్తామనే
వ్యూహం వెనక థీమ్ ఏంటి ? గేమ్ ప్లాన్ ఏంటి ??
ముఖ్యమంత్రి గారు…
మూడింతలు పెంచిన
మూసీ అంచనా వ్యయం
కాంగ్రెస్ ధనదాహానికి సజీవ సాక్ష్యం
తట్టెడు మన్ను తీయకముందే..
కోట్లు తన్నుకుపోయే కుట్రకు తెరతీస్తే భరించం
“మూసీ రివర్ ఫ్రంట్” పేరిట..
బ్యాక్ డోర్ లో జరుగుతున్న బాగోతాన్ని
తెలంగాణ సమాజం అనుక్షణం గమనిస్తోంది
కుంభకోణాల కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాతపెడుతుంది
జై తెలంగాణ
– కల్వకుంట్ల తారక రామారావు