వాస్తవం ప్రధాన ప్రతినిధి- హైదరాబాద్:
మీకు అండగా తెలంగాణ భవన్ ఉంటుంది. మా లీగల్ టీం ఉంటుంది.. రండ్రి..! అని కేటీఆర్ పిలుపునిచ్చి ఆ తరువాత ముఖం చాటేశాడు. జ్వరం వచ్చింది సారీ అంటూ సోషల్ మీడియాలో ఓ మెసేజ్ వదిలాడు. అసలేం జరిగింది…? శనివారం తెలంగాణ భవన్‌కు వందకు పైగా హైడ్రా బాధితులు వచ్చారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ తాను రాలేనని, బాధితులకు మా లీగల్ టీం అండగా ఉంటుందని, తనకు విపరీతమై జ్వరం ఉందని ముఖం తిప్పేశాడు.
లీగల్ టీం వారి సెల్‌ఫోన్ నెంబర్లు వారికిచ్చి ఫోన్ చేయాల్సిందిగా కోరారు. ఆలోపే హరీశ్ ఆగమేఘాల మీద వచ్చి మావాళ్లే మీ దగ్గరికి వస్తారు వెళ్లండని పంపించేశాడు. తెలంగాణ భవన్‌కు బాధితులను రప్పించుకునుడేందీ..? మనమే వాళ్ల వద్దకు వెళ్లాలి గానీ అనే విమర్శలు వచ్చాయి కేటీఆర్ పిలుపు తరువాత. అందుకే కేటీఆర్ అక్కడికి రాలేదు. ఎక్కడికక్కడ ఇక వీరే వెళ్లి అక్క డ లోకల్ లీడర్లతో కలసి బాధితులకు అండగా నిలబడతారన్న మాట.