వాస్తవం ప్రధాన ప్రతినిధి- హైదరాబాద్‌

24Vastavam.in (1)

సర్కార్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైడ్రాకు ఆదిలో వచ్చిన మంచిపేరేమో గానీ ఇప్పుడు జనాగ్రహానికి గురవుతున్నది. పెద్దలనొదిలి పేదలను వంచిస్తున్నారంటూ దుమ్మెత్తిపోస్తున్న వైనం సర్కార్‌ను ఇరకాటంలో పెడుతున్నది. దొరికింది మోఖా అని బీఆరెస్ సోషల్‌ మీడియా దీన్ని అందిపుచ్చుకున్నది. సోషల్ మీడియాలో జనం ఏడిచి, శాపనార్ధాలు పెట్టే వీడియోలను గిరాగిరా తిప్పుతున్నారు. సీఎం అన్న ఇంటికి నోటీసులిచ్చి వదిలేసిన అధికారులు, పేదల పట్ల ఎందుకంత ఉదారత చూపడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఏరి కోరి తెచ్చికుంటే ఇదే పనిని పెట్టుకున్నారా అని జనం తిట్టిపోసే వీడియోలు బాగా వైరల్‌ అవుతున్నాయి.

నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు జనం నుంచి సర్కార్‌కు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. సీఎం రేవంత్‌ ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాడని, కానీ మధ్యలో ఒత్తిళ్లకు తలొగ్గి ఇది ఆగిపోతుందని కూడా భావించారు. సీఎం రేవంత్‌ పులి మీద స్వారీ చేస్తున్నారని ఇది ప్రమాదకరమని కూడా అనుకున్నారు. కానీ ఇది అటు తిరిగి ఇటు తిరిగి పేదల గూళ్లపై పడటంతో జనం ఉలిక్కి పడ్డారు. గగ్గోలు పెట్టారు. లబోదిబోమంటున్నారు. ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు. ఈ చర్యలు సర్కార్‌ను బద్నాం చేసేలా ఉన్నాయి.దీనిపై వెంటనే తేరుకోని ప్రభుత్వం నింపాదిగా రంగనాథ్‌తో ఓ ప్రెస్‌నోట్‌ విడుదల చేయించింది. కానీ అప్పటికే జనం తిట్టిపోసిన వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed