(దండుగుల శ్రీనివాస్)
ఒక్క ఖమ్మం.. ఒక్క భారీ తుఫాను… కాంగ్రెస్ లీడర్ల దమ్మెంతో చూపెట్టింది. ఈ రాష్ట్ర సీఎం ఎంత పనిమంతుడో తెలియజెప్పింది. వరదలకు ప్రాణాలు కోల్పోతున్నా వారిని కాపాడటంలో ఎలా చేతులెత్తి ప్రాణనష్టానికి కారకులయ్యారో చూపెట్టింది. భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలం కాగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రం చిగురుటాకుల వణికిపోయింది. వరదలో కొట్టుకుపోయింది. నిండా నీట మునిగి గూడు, గుండె చెదిరిపోయి సాయం కోసం ఆర్తనాదం చేసింది. ఇక్కడి ముగ్గురు మంత్రులు… భట్టి విక్రమార్క,పొంగులేని శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు.. మొత్తం తొమ్మిది మంది చావుకు కారణమయ్యారు.
ఈ ముగ్గురి నియోజకవర్గాలు మధుర, పాలేరు, ఖమ్మం పక్కపక్కనే. వర్షాలకు బాగా డ్యామేజీ అయ్యింది కూడా ఇక్కడే. వీరి ముగ్గురికీ సమన్వయం లేదు. పాలేరులో ఇద్దరు భార్యభర్తలు కొట్టుకుపోయి చనిపోయినా దిక్కులేదు. హెలికాప్టర్ కోసం సీఎస్‌కు తుమ్మల ఫోన్ చేశాడు. పొంగులేని ఫోన్ చేశాడు. కానీ రాలేదు. ప్రభుత్వం పంపలేదు. సహాయక చర్యలు, ప్రత్యేక బృందాలు లేవు. ఆలోపు అక్క డ జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. మొత్తం తొమ్మిది మంది జలసమాధి అయ్యారు.
ఉమ్మడి ఖమ్మంలో మొత్తం 9 మంది చనిపోగా.. ఇందులో పాలేరు నియోజకవర్గంలోనే ఏడుగురున్నారు. సమీక్షలకే పరిమితమైన సీఎం.. ఇలా తీరుబడిగా ఇవాళ ఖమ్మం బయలుదేరాడు. ముగ్గురు మంత్రులను సమన్వయం చేసుకోలేని సీఎం.. ప్రాణాలు పోయిన తరువాత పరిహారం ఒక లక్ష పెంచాడు.