వాస్తవం ప్రతినిధి- హైదరాబాద్:
సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై నటి షకీలా స్పందించారు. మహిళలపై వేధింపులు మలయాళ పరిశ్రమలోనే కాదు.. తమిళం, తెలుగు ఇండస్ట్రీలలోనూ ఉన్నాయని అన్నారు.
“ఇండస్ట్రీలో కమిట్మెంట్ అడిగేవారు అడుగడుగునా కనిపిస్తారు. మొదట్లోనే తాము అలాంటి పని చేయమని గట్టిగా చెప్తే మున్ముందు సమస్యలు రావు. కమిటీలు, నివేదికలు కేవలం వేధింపుల విషయాన్నే బయట పెడుతున్నాయి. బాధ్యులపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి” అని షకీలా అన్నారు.