(దండుగుల శ్రీనివాస్ )
సిటీలో అత్యంత విలువగల భూములన్న ప్లేస్. మాదాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాలు. ఎన్ కన్వెన్షన్ ఉన్నదక్కడే. దాదాపు 10 ఎకరాల మేర నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించాడు. దీని విలువ బహిరంగ మార్కెట్లో 1200 కోట్లు ఉంటుంది. ఎన్ కన్వెన్షన్ పేరు మోసిన ఫంక్షన్ హాల్. పేరుకు ఒక్క కన్వెన్షన్ సెంటరే . కానీ ఇందులో నాలుగు హాళ్లు ఉన్నాయి. ఒక్కో హాల్ ఖర్చులు పోను కోటి రూపాయల ఆదాయం సమకూర్చి పెడుతుంది. అంటే ఈ లెక్కన నిత్యం నాగార్జున ఈ కన్వెన్షన్ సెంటర్ నుంచి నాలుగు కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఇదిప్పుడు నేలకూలింది. ఇప్పుడు ఇది కాదు డిస్కషన్. ఈ 1200 కోట్ల ఆస్తి ఎవరికి దక్కుతుంది.
కచ్చితంగా సర్కార్‌కు మాత్రం కాదు. ఎందుకంటే ఇది పక్కాగా రిజిస్ట్రేషన్ చేసుకున్న స్థలం. కట్డడమైతే కూల్చారు. ఆదాయం కొల్లగొట్టారు. కానీ ఆ పదెకరాల ల్యాండ్‌ను మాత్రం లాక్కోవడం సర్కార్‌కు సాధ్యంకానిపనేనని చెప్పాలి. కోకాపేట్‌లో గవర్నమెంట్ 100 కోట్లకు ఒక ఎకరం అమ్ముకున్నది. ఆ తరువాత అత్యంత ధర పలికేది ఈ భూములకే. ఎకరాకు 120 కోట్ల విలువ ఉంటుందిక్కడ. అలా పదెకరాల పరిధి ఎన్ కన్వెన్షన్‌ది.
మరి ఈ 1200 కోట్ల ఆస్తిని సర్కార్ కైవసం చేసుకుంటుందా..? అనే చర్చ ఉంది. కానీ ఇది సాధ్యమయ్యేపని కాదు. నిర్మాణాలు చేయకపోతే చాలు. ఆ ల్యాండ్‌ను నిర్మాణేతర పనులకు వాడుకోవచ్చు. లేదా యాజమానే అమ్ముకోవచ్చు. ఈ లెక్కన అక్కడ ఆదాయ వనరులను, ఫామ్‌హౌజ్‌ల పేరిట జరిగిన విలాసవంతమైన జీవితం కోసమై వెలిసిన కట్టడాలను మాత్రం నేలమట్టం చేయగలరు. కానీ ఆ భూములను లాక్కుని హక్కు సర్కార్‌కు లేదు. ఈ ఫామ్‌హౌజ్ లు కూడా అందరివి కూల్చుతుందా..? లేక అస్మదీయులకు అండగా ఉండి కాపాడుకుంటుందా తెలియదు.