కాంగ్రెస్‌ సర్కార్‌కు ‘నమస్తే’…!
రేవంత్‌ ప్రభుత్వానికి జీ హుజూర్‌ అంటున్న బీఆర్‌ఎస్‌ కరపత్రం
ఒకవైపు బీఆర్‌ఎస్‌ నేత ప్రవీణ్‌కుమార్‌ మీడియా సమావేశం…
మరోవైపు ప్రవీణ్‌కుమార్‌ ప్రశ్నలకు ఉదాహరణలతో సమాదానాలు
‘నమస్తే తెలంగాణ’లో చిత్ర, విచిత్ర కథనాలు ప్రచురితం
బీఆర్‌ఎస్‌ శ్రేణులు, నిరుద్యోగులను తీవ్ర గందరగోళంలోకి నెట్టేసిన వైనం

 

వాస్తవం, ప్రధాన ప్రతినిధి: ‘నమస్తే తెలంగాణ’ పత్రిక అంటే బీఆర్‌ఎస్‌ పార్టీ కరపత్రమనే అనుకుంటున్నారా…! అదేం కాదండోయ్‌… ఇప్పుడిప్పుడే రేవంత్‌ ప్రభుత్వానికి వత్తాసు పలికే జవాబుపత్రంగా మారుతోంది. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు అన్నివేళలా వెన్నుదన్నుగా నిలిచిన నమస్తే తెలంగాణ ఇప్పుడు రేవంత్‌ ప్రభుత్వానికి సైతం అండగా నిలబడాలని తహతహలాడుతోంది. గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష తర్వాత మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపికలో టీజీపీఎస్సీ అడ్డగోలుగా వ్యవహరించిందంటూ కొన్నిరోజులుగా బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు లబోదిబోమంటున్న సంగతి తెలిసిందే.

అసెంబ్లీ సమావేశాల్లో అర్ధరాత్రి 12.30గంటలకు కూడా బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ఇదే అంశాన్ని లేవనెత్తి జీఓ 55 ప్రకారం ఎంపిక చేయకుండా… రేవంత్‌ ప్రభుత్వం కొత్తగా జీఓ 29ని తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు తీవ్ర నష్టం చేసిందని గోలగోల చేశారు. ఈ అంశంపై మాజీ ఐపీఎస్‌ అధికారి, బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ సైతం లేఖలపై లేఖలు రాయడంతో పాటు మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో ఏకంగా మీడియా సమావేశం నిర్వహించి సంబంధిత జీవోలు, ఇతర కాగితాలన్నీ మీడియాకు ఇచ్చి హంగామా చేశారు. ఏదేమైనా ఈ విషయం ప్రజల్లోకి పోతుందని కాలర్‌ ఎగరేసుకున్నారు. కానీ మెజార్టీ పత్రికల్లో ఈ వార్త లోపలి పేజీలో ఓ మూలన నాలుగు లైన్లతో సరిపెట్టారు.

అయితేనేం… నమస్తే తెలంగాణలో మాత్రం జోరుగా వస్తుందని భావించిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు మరుసటి రోజు… బీఆర్‌ఎస్‌ కరపత్రాన్ని చూసి మోహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నమస్తే తెలంగాణలో ప్రవీణ్‌కుమార్‌ ప్రెస్‌మీట్‌ వార్త కటౌట్‌ మాదిరి ఇస్తే… ఆయన లేవనెత్తిన అంశాలకు సమాదానాలను మాత్రం బ్యానర్‌ వాçర్తగా ఇవ్వడం గమనార్హం. అంతేకాదు… ఈ బ్యానర్‌ వార్త ఎవరి రిఫరెన్స్‌… ఏ అధికారి చెప్పాడు అనేదేదీ లేదు. కేవలం ప్రభుత్వ వర్గాల పేరిట రాసేయడం గమనార్హం.

You missed