నమస్తే తెలంగాణ మరోసారి వార్తల్లోకెక్కింది. ఆ పత్రిక ఎడిటర్, సిటీ బ్యూరో ఇంచార్జిలు బ్లాక్‌మెయిలింగ్ వార్తలకు తెగబడ్డారంటూ పోలీస్ స్టేషన్‌కెక్కారు సీపీఐ నాయకులు. హయత్‌నగర్ మండలం పెద్ద అంబర్‌పేట్‌లో చాలకాలంగా భూపోరాటం ఉద్యమంలో భాగంగా పేదలు వేసుకున్న గుడిసెల జాగాలను నమస్తే పెద్దలు ఆశించారని వారి అభియోగం. ఓ పదిహేను గుడిసెల స్థలాన్ని వారికివ్వాలని డిమాండ్ చేయగా, వారొప్పుకోలేదట. దీంతో బ్లాక్‌మెయిలింగ్ వార్తలు దిగారని సీపీఐ నాయకులు ఆరోపించారు.
హయత్‌నగర్ పోలీసుకు ఈ మేరకు నమస్తే తెలంగాణపై చర్యలు తీసుకోవాలని వారు పిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడారు. చట్టపరంగా నమస్తే తెలంగాణపై చర్యలు తీసుకోవాలని కోర్టుకు వెళ్తున్నట్టు తెలిపారు. నమస్తే తెలంగాణ యాజమాన్యం బ్లాక్ మెయిలింగ్ వార్తలకు దిగుతున్నదని, ఇలా వార్తలు రాసి కోట్లు కూడబెట్టుకున్నదని ఆరోపించారు. ఈ పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు. పేదల గుడిసెలను కూడా వదల్లేదని, పెత్తందారులతో మమేకమై ఇలాంటి వార్తలు రాస్తున్నారన్నారు.