భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అలర్టయ్యింది. మూడు రోజుల పాటు ఎవరూ బయటకు రావొద్దని అప్రమత్తం చేస్తోంది. డప్పు చాటింపుతో అలర్ట్ చేస్తోంది. ఈ మేరకు అన్ని పల్లెల్లో ఈ డప్పు చాటింపు చేస్తున్నారు. ఈ వర్షాకాలం సీజన్‌లో ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులు, డ్యామ్‌లు నిండుతున్నాయి. అలుగులు పారుతున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి.
దీంతో జనం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరుతున్నది. ఓ పల్లోటూర్లో డప్పు చాటింపు వేస్తున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.