దండుగుల శ్రీనివాస్ – వాస్తవం చీఫ్ బ్యూరో:
సర్కారుపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి తమను ఇంత వరకు కలిసిందిలేదు.. కలిసేందుకు ప్రయత్నిస్తే అపాయింట్‌మెంట్ ఇచ్చిందీ లేదు. కనీసం సీఎస్‌తో నైనా భేటికి ప్రభుత్వం ప్రయత్నించలేదు. దీంతో తిక్కరేగి ఉన్నాయి ఉద్యోగ సంఘాలు. మంగళవారం టీఎన్‌జీవో, టీజీవో సంఘాలు భేటీ అయ్యాయి. కోదండరామ్ ఉద్యోగ సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేసినా.. సంఘాల నేతలు వినలేదు. ఇప్పటి వరకు ఒక్క డీఏ కూడా ఇవ్వకుండా, బదిలీల వేళ ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించకుండా గాలికి వదిలేయడాన్ని తీవ్రంగా ఆక్షపిస్తున్నారు.
కోదండరామ్ నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆర్థిక భారం, కొత్త ప్రభుత్వం అనే సాకులు వారు వినదలుచుకోలేదు. దీనికి తోడు ఉద్యోగ సంఘాల నేతల నుంచి ప్రభుత్వానికి ఈ సమావేశం వేదిక వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందనే హెచ్చరికలు జారీ చేశారు. అయినా రేవంత్ వినడు అన వారికి తెలుసు. వినేవాడైతే పరిస్థితిని ఇక్కడిదాకా తెచ్చునా ..? అనేది క్లారిటీ. అందుకే .. ప్రభుత్వంపై నిరసనాస్త్రం సంధించడమే మార్గమని డిసైడ్ అయ్యారు. ఇంత తక్కువ టైంలో ఉద్యోగ సంఘాల నేతలు సర్కారుపై తిరగబడేందుకు సిద్దపడ్డాయి. త్వరలో సీఎం జిల్లాల టూర్ నేపథ్యంలో ఈ నిరసనను అమలు చేయాలని కూడా వ్యూహం రచిస్తున్నాయి ఉద్యోగ సంఘాలు.