నైజం..!
( కేసీఆర్ మరో కోణం)
ధారావాహిక-6
…………………………………………………………………………
ప్రస్తుతం..
సమయం ఉదయం 10.10 …
ఎర్రవల్లి ఫార్మ్ హౌజ్..
తెల్లని అంగీ.. తెల్లని లుంగీతో కుర్చీపై వేప చెట్టు కింద కూర్చుని ఉన్నాడు కేసీఆర్.
అతని పక్కన జాన్ పెర్కిన్స్ రచించిన ‘దళారీ పశ్చాత్తాపం’ బుక్కు కొన్ని పేజీలు చదివి వదిలేసినట్టుగా పక్కన పెట్టి ఉంది.
ముందు టీపాయ్ మీద ఇంగ్లీష్, తెలుగు దినపత్రికలు.. ఇస్త్రీ చేసి మడత పెట్టిన బట్టల్లా పేర్చి ఉన్నాయి.
పైనున్న ఓ పేపర్ తీసి చదువుతున్నాడు.
సీనియర్ నేత పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన వార్త.. బాల్క సుమన్ నిరసన.. అరెస్టు వార్త ప్రముఖంగా ప్రచురింది ఉందా మొదటి పేజీలో..
రెండు కాళ్లు మెల్లగా ఊపుతూ కళ్లజోడు సవరించుకుంటూ చదువుతున్నాడు కేసీఆర్.
ఎక్కడో కళ్లలో చిన్న చెమ్మ. కనీకనిపించని ఓ తడి.
పేపర్ పక్కన విసిరేసాడు కేసీఆర్. చదవాలనిపించలేదు.
………………………………………………………………………………………….
‘ఓ ఆలే నరేంద్ర, ఓ విజయశాంతి.. ఇంకా ఎందరో కేసీఆర్‌కు బలిపశువులు..’
‘ఎలా..?’
‘టైగర్ నరేంద్ర’ అని ఆకాశానికెత్తి, మునగ చెట్టు ఎక్కించి… మనమంతా ఒక్క పార్టీగా ఉండాలె… ఇలా విడివిడిగా ఉండొద్దు అని నమ్మబలికి.. చివరికి బలిపశువులను చేశాడు’
‘ అది కేసీఆర్ నైజం..!’
ఆకాశానికెత్తుతాడు… ఆ మత్తులో తేలియాడుతున్న సమయంలోనే అధఃపాతాళానికీ తొక్కుతాడు..
…………………………………………………………………………………….
2007లో కేటీఆర్ రాజకీయ రంగ ప్రవేశం…
అప్పట్నుంచి సీనియర్లకు దుర్గతే పట్టిందని చెప్పాలి.
తనకంటూ ఓ టీమ్‌ను ఏర్పాటు చేసుకుంటూ పోయాడు కేటీఆర్.
కేసీఆర్ చుట్టూ ఉండే ఆస్థానకవులు, మేళతాళాల నాయకులు తనకు అవసరం లేదనుకున్నాడు కేటీఆర్. ఎందుకంటే వారికి కేటీయారే రెస్పెక్ట్ ఇయ్యాలె. వాళ్ల ముందు తను చాలా చిన్నవాడు. అన్ని రకాలుగా.
వయసు రీత్యా, రాజకీయ అనుభవం రీత్యా
ఉద్యమ నేపథ్యం రీత్యా..
ఆ ఇన్ఫిరియారిటీ కేటీఆర్‌ను వెంటాడింది.
అందుకే సొంతగా తనకు బకా ఊదే టీమ్‌ను రెడీ చేసుకుంటూ పోతున్నాడు.
యువరాజు చుట్టూ ఈగలు ముసురుకున్నాయి.
కాబోయే రారాజు, మమ్మల్ని ఏలే మహాప్రభు.. అనే విధంగా బిల్డప్ ఇచ్చే టీమ్ ఒకటి రెడీ అయి ఉంది కేటీఆర్ చుట్టూ.
కేటీఆర్‌కు అది సమ్మగా ఉంది. ఇది కదా తనకు కావాల్సింది. ఇదే కదా తను కోరుకుంది.. అనుకున్నాడు.
అందుకే కేసీఆర్‌కు చెప్పిన వాళ్లకు కాకుండా తను సూచించిన వారికే టికెట్లు దొరుకుతున్నాయి.
పరిస్తితి గమనించారు సీనియర్లు. పెద్దాయనతో చెప్పుకోలేరు. ధైర్యం లేదు.
కొడుకు దగ్గరకు పోయి .. ‘ బాబు.. ఇది తగునా..?’ అనే విధంగా భయం భయంగా అడిగారు.
‘అంకుల్ అది నాన్న పరిధిలోని అంశం.. నాకు తెలియదు. మీరు అక్కడే అడగాలి..’ అంటూ నోటితో నవ్వుతూ నొసటితో వెక్కరించే వాడు కేటీఆర్.
అలా పార్టీ భ్రష్టు పట్టించే విధానంలో కేటీఆర్ సక్సెస్‌ఫుల్‌గా అడుగులు వేస్తూ పావులు కదుపుతూ పోతున్నాడు.
ఇంకా కవిత ఎంట్రీ కాలేదు.
(ఇంకా ఉంది)
TO BE CONTINUED…….
Dandugula Srinivas
Senior Journalist
8096677451