నైజం..!

(కేసీఆర్‌ మరోకోణం)

ధారావాహిక-5

 

‘రాత్రి 8 గంటల తరువాతే ఆయన మందుతాగుతాడు. అంతకు ముందు తాగే అలవాటు లేదు.’

‘నాకు తెలిసి ఆయన ఒక్కడే ఏనాడూ తాగింది లేదు.. ఎవరో ఒకరుండాలె’

‘ఇద్దరు లేదా ముగ్గురు .. అంతే..! ఆయనకు నచ్చినవాళ్లు.. వాళ్లతోనే డ్రింక్‌ చేస్తాడు..’

‘అవునా..!’

జయశంకర్‌ సార్‌ అంటుండే..

‘కేసీఆర్‌ ఎసోండన్నాగానీ బై.. మొండోడు. తెలంగాణ కోసం కొట్లాడేందుకు ఒకడు కావాలె. వాడు కేసీఆర్‌ లాంటోడే ఉండాలె. అందుకే మనం సపోర్టు చేయాలె..’

‘ ఆయనను కేసీఆర్‌ ఏనాడైనా అవమానించాడా..?’

‘అవమానించడమంటే.. ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వకపోవడమే. అవును.. రాజ్యసభ మెంబర్‌ను చేయొచ్చు కదా.. చెయ్యలే…’

‘ ఆయనకే కాదు చాలా మందికి పదవులు ఇవ్వకుండా అవమానించాడు. అన్యాయం చేశాడు.’

‘కేసీఆర్‌ దగ్గర ఓ నైజం ఉంది. అదేమంటే తనకు నచ్చకపోతే ఇక వారితో మాట్లాడడు. ముఖం తిప్పుకుంటాడు. పక్కకు పోయి కూసున్నా వారిని చూడనట్టే నటిస్తాడు. అంటే.. వాడు అవమానం భారంతో చచ్చిపోవాలె. ఇంకోసారి అటు చాయలకు కూడా రావొద్దన్న మాట’

‘ అంత కర్కోటకుడు వాడు’

””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””’

కేసీఆర్‌ వేసిన ఎత్తుగడ అప్పుడు పారలేదు. ఇలాంటి తప్పదపు నిర్ణయాలు చాలానే చేశాడు. ఆ తర్వాత తప్పుల మీద తప్పులూ చేశాడు.

ఉన్న 16 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలతో రాజీనామా చేయించాడు.

మళ్లీ సెంటిమెంట్‌ రాజేసే ప్రయత్నం చేశాడు. దీంతో ఇక తిరుగుండదని భావించాడు.

కానీ అనుకున్నదొక్కటి ..అయ్యిందొకటి..

రాజశేఖర్‌రెడ్డి ఇదే మంచి తరుణమనుకున్నాడు. చేజేతులా కేసీఆర్‌ తనకు ఇచ్చిన అద్భుత అవకాశమని సంబురపడ్డాడు.

రంగంలోకి దిగాడు.

రాజశేఖర్‌రెడ్డి ముందు వీరంతా నిలవగలుగుతారా..?

కేసీఆర్‌ ప్లాన్‌ బెడిసికొట్టింది.

16 మంది ఎమ్మెల్యేలలో ఏడుగురే గెలిచారు. 9 మంది ఓడిపోయారు.

ఐదుగురు ఎంపీలలో ఇద్దరు గెలిచారు. ముగ్గురు ఓడారు.

ఒక్కసారిగా పార్టీ పరిస్థితి ఘోరంగా మారిపోయింది.

పూర్తిగా బలహీనపడిపోయింది.

……………………………………………………………………………….

 

‘కేసీఆర్‌కు ఇప్పటి నుంచే కాదు అప్పటి నుంచే అహంభావి.’

‘ తనను కలిసేందుకు ఎవరు వచ్చినా వారికి టైమ్‌ ఇచ్చేవాడు కాదు ఆనాటి నుంచి..’

‘ ఒక సబ్జెక్ట్‌ మీద మాట్లాడేటప్పుడు దాని మీదే గంటల తరబడి చర్చ ఉంటుండే. ఇక ఏదీ పట్టించుకునేవాడు కాదు. ఎవరు వచ్చిన వారిని కలిసేందుకు పర్మిషన్‌ ఇచ్చేవాడు కాదు…’

‘ అలా చాలా మంది తిరిగి వెళ్లిపోయిన సందర్భాలున్నాయి..’

‘ఓసారి కేసీఆర్‌ ని కలిసేందుకు ఢిల్లీ నుంచి చాలా మంది లీడర్లు వచ్చారు. కానీ గంటల తరబడి వారిని కూర్చోబెట్టాడే తప్ప వారికి టైమ్‌ ఇవ్వలేదు…’

‘ అంతటి అహంకారి కేసీఆర్’

‘ ఎందరో తెలంగాణ కోసం కేసీఆర్‌తో కలిసి పనిచేశారు. పైసలు పెట్టుకున్నారు. త్యాగాలు చేశారు. కానీ వారికి పదవులివ్వాలనే సోయి కేసీఆర్‌కు ఏనాడూ లేదు.’

‘ తన ముందు ఎవడూ ఎదగొద్దు.. అనే ఈర్ష్య మెంటాలిటీ..’

‘వేలాది మంది మంగళ సూత్రాలు తెంచిన పాపాత్ముడు వాడు..’

‘నీకే టికెట్ అంటాడు. తీరా బీ ఫామ్‌ ఇచ్చే రోజున పేరు మారుతుంది..’

‘ ఇదే కేసీఆర్‌ స్టైల్‌… నమ్మడానికి లేదు. అంతటి విశ్వాసఘాతకుడు.. చాలా మందిని ఇలాగే మోసం చేశాడు..’

‘కేశ్‌పల్లి గంగారెడ్డికి టికెట్‌ ఇస్తానన్నాడు.. ఎంపీగా తెల్లారి బిగాల గణేశ్‌ గుప్తా పేరును అనౌన్స్‌ చేసిండు… ఇగో ఇట్లనే ఉంటది వానితోని…’

( ఇంకా ఉంది)