వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్:
డీఎస్. ఇందూరు రాజకీయాల్లో ఓ ఎత్తుకు ఎదిగిన బీసీ నేత. ఒకప్పుడు నిజామాబాద్ రాజకీయాలను శాసించాడు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. సీఎం పదవి వరించే వరకు వెళ్లి వెనుదిరిగినవాడు. ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు నెరిపినవాడు. కానీ ఇప్పుడు నాలుగ్గోడలకు, మంచానికే పరిమితమైన ఓ వృద్ధ నేత. సండే ఫాదర్స్ డే సందర్భంగా అతని పెద్ద కొడుకు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ నాన్నకు శుభాకాంక్షలు తెలిపాడు ఇలా.
తన దగ్గర దాచుకున్న ఓ పాత ఫోటోను తన సెల్‌ఫోన్ స్టేటస్‌లో పెట్టుకుని తన యాదిని పంచుకున్నాడు. తండ్రిని నేరుగా చూసేందుకు కూడా సంజయ్‌కు అవకాశం లేదు. ఎందుకంటే డీఎస్ ఇప్పుడు చిన్న కొడుకు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంరక్షణలో ఉన్నాడు. అన్నదమ్ములిద్దరికీ పడదు. తండ్రి చూద్దామని వెళ్లినా అక్కడ అన్నకు పర్మిషన్ లేదు. ఫోన్‌లో మాట్లాడే వీలులేదు. మాట్లాడే అంత ఆరోగ్యంగ డీఎస్ కూడా లేడు. దీంతో ఇలా ఫాదర్స్ డే నాడు నాన్నను యాది చేసుకున్నాడీ పెద్ద కొడుకు.