వేల్పూర్‌లో శుక్రవారం జరగనున్న మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ అంత్యక్రియల కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నారు. హైదరాబాద్‌ నుంచి ఉదయం ఆయన చాపర్‌ ద్వారా వేల్పూర్ చేరుకోనున్నారు. సీఎం రాక కోసం హెలిప్యాడ్‌ తదితర ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. చాలా రోజులుగా సీఎం కేసీఆర్‌ వైరల్‌ ఫీవర్‌తో ప్రగతి భవన్‌కే పరిమితమయ్యారు. ఆయన ఈనెల 15 నుంచి పర్యటనలు, బహిరంగ సభలు ఉన్నాయి.

గురువారం మంత్రి తల్లి అనారోగ్యం కారణంగా చనిపోయిన విషయం తెలుసుకుని ఆయన సంతాపం ప్రకటించారు. శుక్రవారం ఉదయం వేల్పూర్‌లో జరిగే అంత్యక్రియలకు వస్తున్నట్టు రాత్రి స్పష్టత రావడంతో హుటాహుటిన అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. దివంగత రైతు నేత, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తండ్రి వేముల సురేందర్‌ రెడ్డి అంత్యక్రియలకు కూడా సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు.ఆ కుటుంబానికి అండగా నిలిచి మనోధైర్యం కల్పించారు. వేముల సురేందర్‌రెడ్డితో కేసీఆర్‌కు మధ్య మంచి స్నేహబంధం ఉండేది. అలా ఆ బంధం వేముల ప్రశాంత్‌రెడ్డిని సీఎం కేసీఆర్‌కు మరింత దగ్గర చేసింది.

You missed