రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ శుక్రవారం వారి స్వగ్రామం వేల్పూర్ లో జరిగాయి. వేల సంఖ్యలో ప్రజలు వేముల కుటుంబం అభిమానులు అంత్యక్రియలకు హాజరయ్యారు. మంజులమ్మకు అశ్రు నయనాలతో వీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్లో వేల్పూర్ కు వచ్చి మంజులమ్మ పార్థివ దేహంపై పూలమాలలు ఉంచి నివాళులు అర్పించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఆయన కుటుంబ సభ్యులు అజయ్ రెడ్డి రాధికా రెడ్డి తదితరులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం మంజులమ్మ యాత్ర వేలాది మంది జనం మధ్య సాగింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి , శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు, తదితర ముఖ్య నాయకులు హాజరై అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వేముల, సభ్యుల రోదనలు మిన్నంటాయి. సీఎం కేసీఆర్ వేముల కుటుంబంతో ఉన్న ఆత్మీయతను మరోసారి చాటుకున్నారు. మంత్రి వేముల తండ్రి సురేందర్ రెడ్డి మృతి చెందినప్పుడు హాజరై కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్ ..మంత్రి మాతృమూర్తాఇ మృతి చెందిన ఇప్పుడు సైతం వేల్పూరుకు వచ్చి వేముల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి వేముల కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని చాటుకున్నారు.

You missed