జర్నలిస్టులనే అలవోకగా మోసం చేసిన వాళ్ళు ఇక మిగిలిన వాళ్ళను మోసం చేయటం కష్టమా. జర్నలిస్ట్ లు అంటే వాళ్ళు ఏదో పైనుంచి ఊడిపడ్డారు…వాళ్ళు ఏదో గొప్ప అని చెప్పటం కాదు ఇక్కడ ఉద్దేశం. రాజకీయ అవసరాల కోసం నిత్యం ఏదో ఒక సందర్భంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళను కలవటానికి ఛాన్స్ ఉన్న వాళ్ళు అని చెప్పటం మాత్రమే. దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కేసు క్లియర్ చేసిన కూడా పదుల సార్లు హామీ ఇచ్చి…అది కూడా ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం డబ్బులు పెట్టి కొనుకున్న భూమి కూడా ఇవ్వకుండా…ఏడాదిగా అన్ని ప్రధాన పత్రికలు, ప్రధాన టీవీల ప్రతినిధులు ఉన్న సొసైటీ ని వంచించిన కెసిఆర్ ప్రభుత్వం. కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి. ఈ కీలక ఎన్నికల వేళ నిజాలు చెపుతారా…లేక అబద్దాల కొమ్ముకాస్తారా తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది.

Vasireddy Srinivas

You missed