బాల్కొండ కాంగ్రెస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరుకున్నది. ఆ నియోజవకర్గ టికెట్ కోసం పోరాటం ఆగలేదు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి ఇంకా ఈ టికెట్‌పై ఆశలు వదులుకోలేదు. ఎప్పుడైతే ఈరవత్రి అనిల్‌కు ఇక్కడ నుంచి టికెట్ ఇచ్చేది లేదనే విషయం ఎప్పుడో క్లారిటీ ఇచ్చింది అధిష్టానం. ఇక దీనిపై ఆశలు పెంచుకున్నాడు ఆ నియోజకవర్గానికే చెందిన జిల్లా అధ్యక్షుడైన మానాల మోహన్‌రెడ్డి. ఇక బీజేపీ నుంచి టికెట్ ఆశించి అర్వింద్‌తో పొసగక.. తనకు ఇక బీజేపీలో టికెట్ రాదని తెలుసుకుని, కాంగ్రెస్ ఊపందుకుందని తెలుసుకుని సునీల్ కాంగ్రెస్ నుంచి టికెట్ కోసం శక్తి వంచన లేకుండా విశ్వప్రయత్నాలు చేశాడు.
దీనికి అడ్డుకట్ట వేస్తూ వచ్చాడు మోహన్‌రెడ్డి. ఆఖరికి ఎలాగోలా మొన్న కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు సునీల్‌రెడ్డి. ఇక తనకే టికెట్ అని హాయిగా హైదరాబాద్‌లో సేద తీరుతున్న సమయంలో .. మానాల మోహన్‌రెడ్డి తన టీమ్‌ను వెంటేసుకుని నియోజకవర్గంలో పర్యటనలు మొదలు పెట్టాడు. భారీ వర్షాల నేపథ్యంలో తన పర్యటనను కొనసాగిస్తూ తను ఎమ్మెల్యే అభ్యర్థేనని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో కాంగ్రెస్‌లో అయోమయం నెలకొన్నది. గ్రూపులుగా విడిపోయి ఉన్న కాంగ్రెస్ శ్రేణులు ఎవరు ఎవరి పక్షమో తేలడం లేదు.
అటు బీజేపీకి చెందిన కొందరు సునీల్‌రెడ్డి పంచన చేరారు. వీరిని కాంగ్రెస్ శ్రేణులు దగ్గరికి రానీయడం లేదు. ఇది చాలదంటూ మనాల మోహన్‌రెడ్డి వర్గం ఒకటి సునీల్‌కు వ్యతిరేకంగా తయారయ్యింది. దీంతో సునీల్‌కు ఇంకా టికెట్ కష్టాలు తీరలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరగానే అంతా హారతిచ్చి ఆహ్వానిస్తారని అనుకున్నాడు. కానీ ఫీల్డులో సీన్ రివర్సుగా ఉంది. ఇది అంతుపట్టక అధిష్టానం తలపట్టుకుంటున్నది.