ప్రజా కోణంలో విపక్షాల పాత్ర విలువైనది. అధికార పక్షాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచేలా నిరంతరం పనిచేసే గురుతర బాధ్యత ప్రతిపక్షాలపై ఉంటుంది. వానలు వరదలు ఇతరత్రా విపత్తులు ఎదురైనప్పుడు అధికారపక్షం ప్రజలకు అండగా నిలవడం ఎలాగో చేయాల్సిందే. అధికారంలేని ప్రతిపక్షాలు సైతం ఇలాంటి సందర్భాల్లో ప్రజలకు ఆత్మీయ అండను ఓదార్పును అందించాల్సి ఉంటుంది. కానీ ప్రతిపక్షాల నాయకులు తమ పాత్ర విమర్శలు చేయడం, ఆరోపణలు చేయడం వరకే పరిమితం అనుకుంటే ఆ ప్రతిపక్షాలు ప్రజలకు ఉన్న ఒక్కటే లేకున్నా ఒక్కటే. రాష్ట్ర చరిత్ర లోనే లేని విధంగా ఏకంగా 46 సెంటీమీటర్ల కుండ పోత వాన కురిసి చెరువులు తెగి అన్నదాత పంటలు నీట మునిగి సర్వత్ర ఆందోళన చెందిన నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూరు మండలంలో ప్రతిపక్షాల జాడ లేకపోవడం గమనిస్తున్న వారు ఈ మాటనే చెబుతున్నారు.

వేల్పూర్ లో సోమవారం రాత్రి రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో 46 సెంటీమీటర్ల భారీ కుండపోత వర్షం కురిసింది. మండలంలో ఐదు గ్రామాల్లో చెరువుల కట్టలు తెగిపోయాయి జనావాసాలకు నీళ్లు చేరాయి. పంటచేలలో వరదనీరు చేరి ఇసుక మేటలు వేసింది. వేల్పూరు వైపు ప్రధాన రహదారుల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. వరద బీభత్సం చూసి జనాలు భయకంపితులయ్యారు. రైతులు ఆందోళన చెందారు. ఇటువంటి పరిస్థితుల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తక్షణమే స్పందించి సహాయ చర్యలు చేపట్టారు. అధికార యంత్రాంగన్తో మంత్రి వేముల తక్షణమే చేరుకొని పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సహాయక చర్యలు అమలు చేయించారు. ఎమ్మెల్సీ కవిత తన కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ లైన్ నంబరు ఏర్పాటు చేయించారు. వరద బాధిత ప్రాంతాల ఎమ్మెల్యేలతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే అధికార యంత్రాంగం అందుబాటులో ఉన్నారని ప్రజలకు ధైర్యం కల్పించారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కలెక్టర్ తో అధికార యంత్రాంగంతో ఎ ప్పటికప్పుడు మాట్లాడుతూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ నాయకులు కనీసం వరద బాధిత ప్రాంతాలకు రాలేదు. బాధితులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయలేదు. అదంతా మాకెందుకులే అన్నట్లు ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు గాని, బిజెపి నాయకులు గాని తమ తమ పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాల్లో తలమునకలై ఉన్నారు. రానున్న ఎన్నికల్లో టిక్కెట్టు దక్కించుకునే కార్వాయ్ లోనే ఉన్నారు. వారికి బాధితులను కలిసి ధైర్యం చెప్పే సమయం ఎక్కడిది. అదే అధికార పార్టీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు కష్ట కాలంలో ప్రజలను ఆదుకునే కార్యక్రమంలో లీ నమయ్యారు. ఎంతైనా వీరు ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డలు కదా.

You missed