ఆయన బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు. పేరు బస్వా లక్ష్మీనర్సయ్య. పేరుకే అధ్యక్షుడు. అర్వింద్‌ చేతిలో కీలుబొమ్మ. ఇప్పుడు ఈయన గురించి టాపిక్‌ ఎందుకొచ్చిందంటారా…? బీజేపీకి చెందిన ఆర్మూర్‌ ,బాల్కొండ, బోధన్‌ మండలాల అధ్యక్షుల మార్పు జరిగింది. వీరంతా వెళ్లి అర్వింద్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బైఠాయించి నినాదాలు చేశారు. నిరసన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై ఎంపీ అర్వింద్‌ స్పందించాడు.

చావు కబురు చల్లగా చెప్పినట్టు .. ఈ మార్పుతో నాకేం సంబంధం..? ఇదంతా చేసింది జిల్లా అధ్యక్షుడు కదా..? అని తప్పించుకునే యత్నం చేశాడు. వాస్తవానికి ఇదంతా చేసింది అర్విందే. అది ఆ పార్టీ నేతలందరికీ తెలుసు. అర్వింద్‌ ఎట్ల చెబితే అట్ల బస్వా నడుచుకోవాల్సిందే. లేకపోతే బస్వా పదవి కూడా పోతది. అది తెలుసుకునే గప్‌చుప్‌గా అర్వింద్‌ మార్చిన అధ్యక్షుల లిస్టులో ఓ సంతకం చేసి తన పనికానిచ్చేశాడు. ఇప్పుడు అర్వింద్‌ బస్వాను బక్రా చేసి మరీ ఆయన మీద నెపం నెట్టే యత్నం చేశాడు.

ఎవరు చేశారనేది కాదు సమస్య. మార్పు వల్ల పార్టీకి వచ్చిన లాభనష్టాలపైనే కదా డిస్కషన్‌. కానీ అధిష్టానం ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే ఇది అర్వింద్‌ నిర్ణయం కాబట్టి.

You missed