తెయూ వీసీగా వాకాటి కరుణ

ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం…

సీనియర్‌ ఐఏఎస్ నియామకంతో సర్వత్రా హర్షం.. అక్రమార్కుల గుండెల్లో గుబులు…

ప్రభుత్వం తెయూను గాడిలో పెట్టేందుకు సీరియస్‌ నజర్‌…

వీసీ రవీందర్‌గుప్తకు షరతులతో కూడిన బెయిల్‌… రవీందర్ టీమ్‌కు త్వరలో ప్రభుత్వం బహుమానం..?

 

అనుకున్నట్టే జరిగింది. వాస్తవం చెప్పిందే నిజమైంది. తెలంగాణ యూనివర్సిటీని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. ఇన్‌చార్జి వీసీగా సీనియర్‌ ఐఏఎస్ ఆఫీసర్ వాకాటి కరుణను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. రవీందర్‌ గుప్తా వీసీగా వర్సిటీ పరువు గంగలో కలిపాడు. దీంతో ప్రభుత్వం మరింత సీరియస్‌గా దీనిపై ఫోకస్‌ చేసింది.

ఏసీబీ వలలో చిక్కిన రవీందర్‌ గుప్తా గురువారం షరతులతో కూడిన బెయిల్‌తో బయటకు వచ్చాడు. పాస్‌పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రతీ ఆదివారం స్టేషన్లో సంతకం చేయాలనే కండిషన్‌ విధించారు. ఎంక్వైరీ నడుస్తున్నది. గుప్తాకు అండగా నిలిచిన వారి అక్రమాలపై ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. పాత రిజిస్ట్రార్లతో పాటు ఓ పది టీమ్ పై ప్రభుత్వం నజర్ పెట్టినట్టు తెలుస్తోంది. త్వరలో అక్రమాల గుట్టు తేల్చి వీరికి బహుమానం అందజేయనున్నట్టు విశ్వసనీయ సమచారం.

ఇకపై తెలంగాణ యూనివర్సిటీలో ఇలాంటి అక్రమాలకు తావే లేకుండా చేసేందుకు, పూర్తి ప్రక్షాళన దిశగా వర్సిటీ పాలన సాగనుంది. వాకాటి కరుణ రంగ ప్రవేశంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుండగా.. అక్రమార్కుల గుండెల్లో వణుకు మొదలయ్యింది.

You missed