నిరాధార ఆరోపణలపై మంత్రి ఉగ్రరూపం… గిరిగీసి బరిలోకి దిగిన వేముల… నీతిమాలిన ఆరోపణలతో నన్నెవడూ ఆపలేడు.. బీజేపీ నేత మల్లిఖార్జున్‌ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ప్రశాంత్‌రెడ్డి… కంకర మిషన్‌ , కాంట్రాక్ట్‌ కమీషన్ల ఆరోపణలపై తనదైన శైలిలో ఎన్‌కౌంటర్‌…. సవాల్‌.. క్రషర్ నీకే ఇస్తా.. కాంట్రాక్టులు నీకే ఇస్తా…. రా తీసుకో…. వారంలోగా సవాల్‌కు సమాధానం ఇవ్వు.. లేకపోతే ముక్కు నేలకు రాయి…. నాకు మంచి పేరుస్తుందనే మీ బాధ… అభివృద్దిలో నన్నాపే దమ్ము ఎవ్వడికీ లేదు.. తిండి తినేందుకే టైం లేదు… కారులోనే నా తిండి… నాలుగు గంటల నిద్ర కూడా ఉండదు… నా కమిట్‌మెంట్‌ ప్రజలకు తెలుసు… ఆవేదన, ఆగ్రహావేశాలతో బీజేపీ నేత పై మంత్రి విశ్వరూపం…

నిరాధార ఆరోపణలపై మంత్రి ఉగ్రరూపం…

గిరిగీసి బరిలోకి దిగిన వేముల… నీతిమాలిన ఆరోపణలతో నన్నెవడూ ఆపలేడు..

బీజేపీ నేత మల్లిఖార్జున్‌ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ప్రశాంత్‌రెడ్డి…

కంకర మిషన్‌ , కాంట్రాక్ట్‌ కమీషన్ల ఆరోపణలపై తనదైన శైలిలో ఎన్‌కౌంటర్‌…. సవాల్‌..

క్రషన్‌ నీకే ఇస్తా.. కాంట్రాక్టులు నీకే ఇస్తా…. రా తీసుకో….

వారంలోగా సవాల్‌కు సమాధానం ఇవ్వు.. లేకపోతే ముక్కు నేలకు రాయి….

నాకు మంచి పేరుస్తుందనే మీ బాధ… అభివృద్దిలో నన్నాపే దమ్ము ఎవ్వడికీ లేదు..

తిండి తినేందుకే టైం లేదు… కారులోనే నా తిండి… నాలుగు గంటల నిద్ర కూడా ఉండదు… నా కమిట్‌మెంట్‌ ప్రజలకు తెలుసు…

ఆవేదన, ఆగ్రహావేశాలతో బీజేపీ నేత పై మంత్రి విశ్వరూపం…

 

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఉగ్రరూపం ప్రదర్శించారు. తనపై ఇన్ని రోజులుగా బీజేపీ నేత మల్లిఖార్జున్‌ రెడ్డి చేస్తూ వస్తున్న నిరాధార ఆరోపణలపై ఆయన భగ్గుమన్నారు. తనదైన శైలిలో మాటలు, సవాళ్లతో మల్లిఖార్జున్‌ రెడ్డిపై ఎన్‌కౌంటర్‌ చేశారు. గిరిగిసీ బరిలోకి దిగారు. రా.. చూస్కుందాం.. అనే రేంజ్లో ఆయన ప్రసంగం కొనసాగింది. బాల్కొండలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఇప్పటి వరకు మల్లిఖార్జున్‌ రెడ్డి చేస్తూ వస్తున్న ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టడమే కాదు.. సవాల్‌ కూడా విసిరారు. తనపై చేస్తున్న ఆరోపణలకు సవివరంగా సమాధానమిస్తూనే… మల్లీఖార్జున్‌ రెడ్డి ఎంతలా దిగజారి ఆరోపణలు చేస్తున్నారో ప్రజలకు వివరించే క్రమంలో ఆయన తనదైన శైలిలో మాట్లాడారు. ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తూనే బీజేపీ నేతను ఆత్మ సంరక్షణలో పడేశాడు. క్రషర్‌ పేరుతో నాలుగు వందల కోట్లు సంపాదించానంటున్న బీజేపీ నేతకు బంపర్‌ ఆఫర్‌ కూడా ఇచ్చారు మంత్రి. రా నీకే ఇస్తా.. పదికోట్లకు మొత్తం రాసిస్తా… తీసుకో. కాంట్రాక్టు పనులకు కమీషన్‌ తీసుకుంటున్నానని చేస్తున్న ఆరోపణలకు కూడా ఆయన తీవ్రస్థాయిలో కౌంటర్‌ ఇచ్చారు. నీకే రోడ్ల కాంట్రాక్టులు ఇప్పిస్తా. వందల కోట్లు పనులు ఇంకా చేయాల్సి ఉంది. అవన్నీ నీకు నచ్చిన , నువ్వు చెప్పిన కాంట్రాక్టర్‌కే ఇప్పిస్తా.. చేసుకో.. నాకు కావాల్సింది అభివృద్ధి.. ఈ రెండు సవాళ్లకు వారంలోగా సమాధానం ఇవ్వు..లేదా ముక్కు నేలకు రాయి.. అంటూ ఆయన అల్టిమేటం జారీ చేశారను. నాది కమీషన్లు తీసుకునే బతుకు కాదు.. నలుగురిని బతికించే మనసు అని ఆయన కుండబద్దలు కొట్టారు. మొత్తానికి చాలా రోజుల తర్వాత మంత్రి చేసిన హాట్‌ కామెంట్స్‌ ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ శ్రేణులు ఆత్మసంరక్షణలో పడ్డాయి.

ఆయనేమన్నాడంటే….

  • ” ప్రతిపక్షాలవి ఎంత చిల్లర కుట్రలంటే బాధేస్తది. బాల్కొండ నియోజకవర్గం మొత్తానికి ఒక కంకర క్రషర్ ఉన్నది. మా బంధువులు పెట్టుకున్నరు ఆ కంకర మిషను. రోడ్లకు, బిల్డింగులకు అక్కడ నుంచే కంకర రావాలె. నేను ఆర్‌అండ్‌బీ మంత్రి అయిన కాబట్టి విపరీతంగా రోడ్లు సాంక్షన్ చేసుకున్న. ఇంకా 300 కోట్ల పనులు ఇంకా కావాలె. ఇన్ని రోడ్లు చేయాలి ఇంకా. ఇంత అభివృద్ధి జరిగితే ప్రశాంత్‌రెడ్డికి మంచి పేరొస్తది. ఈ పనులు కాకుండా చూడాలె. ఈ పనులు చేసే కాంట్రాక్టర్ల మీద రోజు ఫిర్యాదులు. క్రషర్ ఓనర్‌ మీద రోజు ఫిర్యాదులు. ఈ కంకర మిషన్‌ మీద మూడు నాలుగు వందల కోట్లు మీమిద్దరం సంపాదించినమట. ఓ పది కోట్లిచ్చి ఆ కంకర మిషన్ నువ్వే తీసుకోరా బాబు..పది కోట్లు కాదు పదెకరాల భూమి కూడా ఉన్నది.. కంకర మిషన్ కొత్తదున్నది. ఇవన్నీ కలిపి పదికోట్లకే ఇచ్చేస్తా తీసుకో. నువ్వే సంపాదించుకో ఆ 400 కోట్లు..నాకు రోడ్లు కావాలె.. నువ్వు సంపాదంచుకున్నా నాకు బాధ లేదు. వీళ్లు పెట్టే ఇబ్బందులకు మేం చేయం.. బంద్‌ చేసుకుంటం అనే కాడికొచ్చింది. ఇది బందయితే మనం కంకర కోసం ఆర్మూర్‌కు పోవాలె.. ఇంకో దగ్గరకు పోవాలె.. దగ్గర్లో ఎక్కడా లేవు. రేట్లు పెరగుతయి. పనులు కావొద్దు. ప్రశాంత్‌ రెడ్డికి పేరు రావొద్దు. వాళ్లు ఎన్ని ప్లాన్లు వేసినా.. నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా..బాల్కొండలో అభివృద్ది ఆగే సమస్యే లేదు. గుత్తేదార్లు దొరకతలేరు. రోడ్లు ఏపియ్యడానికి. కాంట్రాక్ట్‌ పనుల్లో కమిషన్లు తీసుకుంటమంటున్నరు కదా.. ఆ పనులు కూడా మీరే చేస్కోండ్రి… మీ ఇష్టమొచ్చిన కాంట్రాక్టర్లను తీసుకురండ్రి మీకే ఇచ్చేస్తా వందల కోట్ల కాంట్రాక్టులు ఇప్పిస్తా… పనులు చేపించండి..” అంటూ ఆయన విరుచుకుపడ్డారు.
  • “కమిషన్లు తీసుకునే బతుకు కాదు నాది.. నలుగురికి సాయం పడే బతుకు నాది… నేను కష్టపడి సంసాదించిన. క్రషర్‌ … పదికోట్లకు ఇస్తా నువ్వే నడిపియ్యు.. వారం లో సమాధానం లేకపోతే ముక్కు నేలకు రాయాలె.
  • పనులు, కమీషన్లు నీకే.. వంద కోట్ల పనులు నీకే ఇస్తా…. వారంలో ముందుకు రావాలి.. లేదంటే ముక్కు నేలకు రాయాలే..ఊకున్న కొద్దీ .. మరీ దిగజారి మాట్లాడుతున్నారు. మన పని మనం చేసుకుందాం..అని ఇన్ని రోజులు ఓపిక పట్టిన… నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నరు. టైమ్‌ సరిపోక వచ్చేటప్పుడు కార్ల అన్నం తింటున్న…. నాలుగైదు గంటల నిద్ర కూడా లేదు. నన్ను కమిషన్లు తీసకుంటా అంటవా.. అని మల్లిఖార్జున్‌ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • ” గంజాయికి పిల్లలు అలవాటు పడుతున్నారు… నేను పోలీసులతో పదిసార్లు కూసొని మాట్లాడిన… జిల్లాలో అందరికంటే ఎక్కువు దొరకవట్టింది మనదగ్గరే.. వదలొద్దు ఎవరినీ అని చెప్పినా.. కఠినంగా ఉన్నాం. ఆదిలాబాద్‌ దగ్గర పండిస్తున్నరు. అక్కడ కూడా అరెస్టు చేపించం.. మా తమ్ముడిని గంజాయి స్మగర్ల అంటుండు. ఎంత సిగ్గుమాలిన మాటలు…అమ్మేటోడిని వదలొద్దు.. కేసులు చేయ్యండిని పోలీసులకు చెప్పినం.. ప్రతీ చోట కేసులు పెట్టించినం…” అని ఆయన వివరించారు.

 

You missed