మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ పార్టీ జాతీయ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్ జవదేకర్ జిల్లాకు వచ్చాడు. పార్టీని బలోపేతం చేసేక్రమంలో కార్యకర్తలకు, నాయకులకు భరోసా నింపేందుకు , భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేసేందుకు. కానీ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ రెండో రోజు ప్రకాశ్ పర్యటనకు డుమ్మా కొట్టాడు. ముఖం చాటేశాడు. కారణం.. వాస్తవం లో వచ్చిన వార్తే. అర్వింద్ ఒంటెత్తు పోడకలపై అర్బన్‌తో పటు పలు నియోజకవర్గాల్లో రెబల్స్‌గా పార్టీ నేతలో పోటీ చేసేందుకు ఉద్యక్తులవుతున్నారని ఆ కథనం సారాంశం.
దీంతో ఇది పార్టీలో తీవ్ర చర్చకు తెరతీసింది. వాస్తవం వార్త అందరిలో చర్చకు లేపి రచ్చ రచ్చ చేసింది. ఇప్పటికే అర్వింద్ చుట్టూ అసమ్మతి నేతలు పోగవుతున్నారు. తాజాగా పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నర్సయ్య కూడా అర్వింద్‌తో దూరం పాటిస్తున్నాడు. అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. అర్బన్ ఎమ్మెల్యే టికెట్ అంశం .. అర్వింద్‌ను చాలా మందికి దూరం చేస్తోంది. యెండల లక్ష్మీనారాయణ వర్గాన్ని కూడా పూర్తిగా తొక్కిపెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు అర్వింద్. చాలా వరకు అధికారిక కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు యెండలకు పిలుపు కూడా ఉండదు. ప్రకాశ్ పర్యటన సందర్బంగా యెండలకు పిలుపు వచ్చింది. ఇది అర్వింద్ జీర్ణించుకోలేకపోయాడు.
అంతా తానై పార్టీని నడిపిస్తూ తన చెప్పు చేతల్లోనే పార్టీని పెట్టుకోవాలని చూసిన అర్వింద్‌కు ఈ పరిణామాలు మింగుడు పడటం లేదు. దీనికి తోడు ప్రకాశ్ జవదేకర్ తొలి రోజు పర్యటన నాడే వాస్తవం డిజిటల్ పత్రికలో అర్వింద్ పెత్తనంపై రెబల్ పోటీ శీర్షికన వార్తా కథనం ప్రచురితం కావడంతో ఇది మరింత చర్చకు తెర తీసింది. దీంతో అదే రోజు సాయంత్రం అర్వింద్ బోధన్ ప్రోగ్రాం పేరు చెప్పి వెళ్లిపోయాడు. మళ్లీ రెండో రోజు పర్యటనకు రానే లేదు. ఇక్కడి లోకల్ లీడర్లతో ప్రకాశ్ కార్యక్రమాలను కానిచ్చేశారు. ఇదీ ఇప్పుడు ఆ పార్టీలో తీవ్ర చర్చకు దుమారానికి తెర లేపింది.
కథ అడ్డం తిరిగింది….
అర్వింద్ ఉన్న సమయంలో పార్టీలోకి ఇప్పటి వరకు యెండల లక్ష్మీనారాయణు కాలు మోపనీయలేదు. కార్యక్రమం ఏదైనా యెండల సీనియర్ లీడర్ అయినా.. అర్వింద్ అతడిని ఆహ్వానించేవాడు కాదు. కానీ ప్రకాశ్ జవదేకర్ రాక సందర్బం… జిల్లా అధ్యక్షుడు బస్వాకు అర్వింద్‌తో పెరిగిన దూరం నేపథ్యం యెండలకు ఆహ్వానం పంపక తప్పలేదు. దీంతో యెండల లక్ష్మీనారాయణ తను ఉన్న సమయంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని కూడా అర్వింద్ జీర్ణించుకోలేకపోయాడు. అసమ్మతి నేతలంతా కలిసి తను నిర్మించుకున్న సామ్రాజ్యానికి తూట్లు పొడుస్తున్నారనే భావనలోకి వెళ్లిపోయాడు. ఆత్మసంరక్షణలో పడిపోయాడు.