చేస్తుంది మేము.. చెప్పుకునేది నువ్వా..?? సిగ్గు, శరం లేదా అర్వింద్..!
అర్వింద్…! ఆర్వోబీపై నీ షోపుటప్‌లు బంజెయ్..
మాధవనగర్ ఆర్వోబీపై ఎంపీ పై ఫైర్ అయిన ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్..
రూ. 63 కోట్లతో అప్రోచ్‌రోడ్లు, ఫ్లై ఓవర్లు నిర్మిస్తుంది మేము… మీ ౩౦ కోట్లలో ఒక్క పైసా కూడా ఇంకా మీరు ఖర్చు పెట్టలే..
మాయ మాటలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే దగల్బాజీ నువ్వు… నీ మాటలెవ్వరూ నమ్మరు…
ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానన్నావ్..? ఏదీ…? రైతుల దగ్గరకు వెళ్తే తంతారని .. ఇలా ఫేక్, వాట్సప్ యూనివర్సిటీ ప్రచారాలు చేసుకుంటూ కాలం గడుపుతున్నావ్…
ఎంపీ అర్వింద్ గోవన్న స్ట్రాంగ్ వార్నింగ్…
మాధవనగర్ ఆర్వోబీ పనుల ప్రగతిలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ చేస్తున్న అసత్య ప్రచారాలపై ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ఫైర్ అయ్యారు. ఇత్తేసి పొత్తు గూడిన చందంగా అర్వింద్ .. ఈ ఆర్వోబీ పనులను తామే చేస్తున్నామని, కేంద్రమే అంతా ఖర్చుపెడుతుందనే అబద్దపు ప్రచారాలను చేస్తూ అవే తప్పుడు కూతలు కూస్తున్నాడని, దగుల్బాజీ మాటలు చెప్పుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు.
బుధవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 63 కోట్లు కేటాయించి భూసేకరణ, ఇరువైపులా అప్రోచ్ రోడ్లు, ఫ్లైఓవర్లు నిర్మిస్తూ పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేసేందుకు కృషి చేస్తన్నదని, ఆర్‌అండ్‌బీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఈ పనుల పురోగతిపై మొదటి నుంచి దగ్గరుండీ నిధుల కేటాయింపుతో పాటు పనులు సత్వరం జరిగేలా చూసుకుంటున్నారని తెలిపారు. కష్టం ఒకరిది..తప్పుడు ప్రచారాలతో లాభపడాలనే వాట్సాప్ యూనివర్సిటీ దొంగ తెలివి అర్వింద్‌దని ఆయన ఘాటు విమర్శలు చేశారు.
ప్రజలకంతా తెలుసునని, ఆనాడు పార్లమెంటు ఎన్నికల్లో తాను ఎంపీగా గెలిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని ఆర్మూర్ ఎన్నికల ప్రచార సభ వేదికగా బీజేపీ జాతీయ నాయకుడు రామ్ మాధవ్‌తో చెప్పించి ..తప్పుడు హామీ ఇచ్చి గెలిచావని, బాండు పేపర్ రాసి మరీ రైతులను మోసం చేసిన నువ్వో చరిత్ర హీనుడవు, తప్పుడు హామీలతో గద్దెనెక్కిన దగుల్బాజీ ఎంపీవని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నీ రాజకీయ జీవితమే ఫేక్ అని, నీ సర్టిఫికేట్లు ఫేకేనని, అబద్దాల మేడల మీద రాజకీయం చేస్తూ కాలం గడుపుతున్న నీ దగుల్బాజీ రాజకీయం పేక మేడలా కుప్ప కూలిపోకతప్పదని హెచ్చరించారు.
ఇప్పటి వరకు ఆర్వోబీ పనులు జరుగుతున్నవన్నీ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనని, కేంద్రం నిధులు ౩0 కోట్లలో ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని, కానీ అర్వింద్ మాత్రం డబ్బా కొట్టుకుంటూ అంతా తామే చేస్తున్నామంటూ వాట్సాప్ యూనివర్సిటీ రాజకీయాలు చేస్తూ, ప్రజలు పిచ్చోళ్లు నమ్ముతారనే భ్రమలో బతుకుతున్నాడని దుయ్యబట్టారు. ఎంపీగా గెలిచిన దగ్గర్నుంచి ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లా ప్రజలకు, పార్లమెంటు నియోజవకర్గ ప్రజలకు ఒక్క పైసా పనైనా చేసి పెట్టావా..? ఏమైనా లాభం చేకూర్చావా..? కేంద్ర నిధులు తెచ్చి అభివృద్ధి చేశావా..? ఏమీ లేని ఇస్తరి ఎగిరెగిరి పడ్డట్టు… నువ్వు మాయమాటలు చెప్పే అబద్దపు, దొంగ, దగుల్బాజీ, ఫేక్ ఎంపీ అని ప్రజలు ఏనాడో గ్రహించారని, అందుకే సోషల్ మీడియా, వాట్సాప్ యూనివర్సిటీలోనే తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ బతుకుతున్నావు తప్పితే.. ప్రజాక్షేత్రంలో తిరిగే అర్హత కోల్పోయావని, అలా తిరిగితే ఉరికిచ్చి ఉరికిచ్చి తంతారనే భయం వెంటాడుతోందని, దమ్ము, ధైర్యం ఉంటే రైతుల వద్దకు వెళ్లి పసుపుబోర్డు గురించి మాట్లాడాలని ఆయన సవాల్ విసిరారు. ఇత్తేసి పొత్తు కూడే చందంగా.. ఇచ్చేది గోరంతా.. చెప్పుకునేది కొండంత.. మీరు ఎంత చెప్పినా.. వక్రభాష్యాలు చేసినా ప్రజలు నమ్మను గాక నమ్మరని ఆయన అన్నారు.