ఉత్సవాల ఊసే ప్రధానం..
కేబినేట్ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చిన విషయం ఇదే..
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఊసే లేదు.. ఉసూరుమన్న ఇందూరు ఆశవాహులు..
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై సీఎం కేసీఆర్‌కు అనాసక్తి.. ఇక ఆ ఊసు ఎత్తే ఆలోచనల్లో ఆయన లేడు…
జిల్లాలో నాయకులు పెట్టుకున్న ఆశలకు గండి… ఇక ఎవరి దారి వారిదే…
వాస్తవం ప్రతినిధి- హైదరాబాద్:
కేబినేట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని అంతా భావించారు. పెద్దగా ఏ నిర్నయాలు లేవు. అన్నీ పాత అంశాలే. జూన్ 2 ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా 21 రోజుల పాటు జరుపుకునే వేడుకులపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఇళ్ల నిర్మానాలకు మూడు లక్షల రూపాయల పథకంపై మాట్లాడలేదు. చర్చ జరగలేదు. దళిత బంధు ఊసెత్తలేదు. గిరిజన, బీసీ బంధుపై ఇప్పుడే మాట్లాడొద్దనుకన్నారు. వ్యవసాయం, నకిలీ విత్తనాలు, ప్రకృతి విపత్తులను తట్టుకునేందుకు ఒక నెల ముందుగా పంటలు వేసుకోవడం.. తదితర కామన్, నార్మన్ ఇష్యూలపైనే ప్రధానంగా కేబినేట్‌లో చర్చ జరిగింది.
వనపర్తి తదితర ప్రాంతాల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలన్నారే గానీ, హైదరాబాద్, ఇతర జిల్లాల ఊసెత్తలేదు. ఇది జర్నలిస్టుల ఆగ్రహానికి లోను చేసేదే. ఎంతో కాలంగా సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు ఆశలు పెట్టాడు. కానీ ఇప్పటి వరకు అతీగతీ లేదు. ఒప్పుడు ఒకట్రెండు జిల్లాలకు స్థలం కేటాయిస్తున్నామని ఊరించి.. మిగిలిన వారికి ఉసూరుమనిపించారు. అన్నింటికన్నా ముఖ్యంగా… గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీనిపై జిల్లాలో గంపెడాశలు పెట్టుకున్నారు.
రాజేశ్వర్ జిల్లా నుంచే గవర్నర్ కోటాలో మూడు టర్మ్‌లు ఎమ్మెల్సీగా చేశాడు. ఆ ఖాళీ అయ్యే స్థానం మళ్లీ జిల్లాకే వస్తుందని అంతా అనుకున్నారు. ఆశలు పెట్టుకున్నారు. దీనిపై కనీసం సీఎం నోరెత్తలేదు. దీని ప్రస్తావన తీయలేదు. ఇకపై దీని గురించి మాట్టాడటం కూడా చేయకపోవచ్చని అనిపిస్తున్నది. గవర్నర్‌కు సీఎంకు మధ్య టర్మ్స్ బాగా లేకపోవడంతో ఎవరి పేర్లు చెప్పి ఏదో మెలిక పెడుతుందనే భావనలో ఉన్నాడు కేసీఆర్. దీంతో ఎవరి పేర్లు పంపాలన్నా ఆయన వెనుకాముందాడుతున్నాడు. అందులో జిల్లా నుంచి మాత్రం ఎవరి పేరును కూడా ప్రతిపాదించే ఇంట్రస్ట్ ఆయనకు లేదు. దీంతో జిల్లాకు ఎమ్మెల్సీ కోటాలో రిక్త హస్తమే ఎదురుకానుంది. ఆశలు అడియాశలే కానున్నాయి.