కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే అంతే మరి. తమదే నడవాలి. అంతా తమకే కావాలి. అన్నం పెట్టిన పార్టీకి సున్నమైనా పెడతాం కానీ .. తమ వైఖరిలో మార్పులేదని నిరూపిస్తారు ఈ అన్నదమ్ములు. వైఎస్ఆర్ జమానా నుంచి వారిది అంతా పంథా. ప్రజలే నమ్ముతూ వచ్చారు. గెలిపిస్తూ వచ్చారు. కానీ మునుగోడు ఉప ఎన్నిక పాలకు పాలు, నీళ్లకు నీళ్లు లా గోముఖ వ్యాఘ్రాల అసలు రూపాలని బయట పెట్టింది. తమ్ముడు వేల కోట్ల కాంట్రాక్టుల కోసం బీజేపీ పంచన చేరితే.. అన్న ఇలా దూరదేశాలకు వెళ్లి ఫోన్ల ద్వారా తమ్ముడిని గెలిపించాలని కోరుతున్నాడు. బెదిరిస్తున్నాడు. లోబర్చుకుంటున్నాడు. కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్యలా మారిన తరుణంలో దగ్గరుండి మేలు చేయాల్సిందిపోయి.. పాలు పోసి పెంచిన పార్టీని కాలనాగులా కాటువేసేందుకు రెడీ అయ్యాడు. కోమటిరెడ్డి బ్రదర్స్ నైజమే అంత. నిజ స్వరూపమే ఇంత. కానీ జనాలకు తెలుసుకునేందుకు చాలా టైమ్ పట్టింది. ఇగో ఇలా వెంకట్‌రెడ్డి ఏకంగా ఫోన్ చేసి తమ్ముడిని గెలిపించడని అడుక్కోవడమే ఫోన్ కాల్ లీకయ్యే వరకు కూడా వీరిని జనాలు నమ్ముతూనే ఉన్నారు. పార్టీలను బొందపెట్టాలే. ఆ బొందపై మనం పూలమొక్కై ఎదగాలె.. కోట్లు సంపాదించాలె. ఇంక దీనికి నీతి, నియమం, జాతి, పార్టీ తేడా లేదు.. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు మాత్రం రాజకీయ సమాధి కట్టేందుకు రెడీ అయ్యారు మునుగోడు జనం…..
టిపిసిసి స్టార్ క్యాంపెనర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆడియో లీక్…
మునుగోడు లో బీజేపీ అబ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ఓటు వేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ కాల్..
ఓ కాంగ్రెస్ లీడర్ తో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియా లో వైరల్..
ఈ దెబ్బ తో పీసీసీ ప్రెసిడెంట్ నేనే అవుతా అంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ కాల్ లో సంభాషణ..
రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తా అధికారంలోకి తీసుకొస్తా…
పార్టీలను చూడొద్దు రాజగోపాల్ రెడ్డికి ఓటెయ్యాలి…
ఏదైనా ఉంటే నేనే చూసుకుంటా…
చచ్చిన బతికిన రాజగోపాల్ రెడ్డి సహాయం చేస్తూ ఉంటారు… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ఓటు వేయాలని ఫోన్ కాల్..