నిరుపేద కుటుంబాల భ‌రోసా క‌ల్పించి…సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కార్పొరేట్ వైద్యం అందించి కాపాడుకుంటున్నామ‌ని జిల్లా యువ నాయ‌కులు, జిల్లా ప‌రిష‌త్ ఆర్థిక, ప్ర‌ణాళిక సంఘం స‌భ్యులు బాజిరెడ్డి జ‌గ‌న్మోహ‌న్ అన్నారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్న అర్వింద్ ఆనాడు ప‌సుపు రైతుల‌ను మోసం చేసి గెలిచాడ‌ని, ఏనాడైనా పేద కుటుంబాల‌కు పీఎం రిలీఫ్ ఫండ్ అందించాడా..? అని ఆయన నిల‌దీశారు. త‌ప్పుడు ప్ర‌చారాల‌తో, అబ‌ద్దాల వాగ్డానాల‌తో గెలిచిన, రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీ నేత‌ల‌కు రానున్న రోజుల్లో ప్ర‌జ‌లే గుణ‌పాఠం చెబుతార‌ని హెచ్చ‌రించారు.

కేసీఆర్ ప్ర‌భుత్వం నిరుపేద కుటుంబాలకు భరోసా కల్పించేందుకే ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్, రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని మోపాల్ మండలంలోని రైతువేదిక వద్ద వివిధ గ్రామాలకు చెందిన 37 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్​ ఫండ్​ చెక్కులను జ‌గ‌న్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ లతా కన్నిరామ్ ,జడ్పిటిసి కమలా నరేష్ , టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మోర్చ శ్రీనివాస్ , కెసిఆర్ సేవాదళ్ కన్వీనర్ కోర్వ దేవేందర్ , రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కంటే గారి శ్రీనివాసరావు , స్థానిక సర్పంచులు , ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, మండల సీనియర్ నాయకులు, టిఆర్ఎస్ కార్యకర్తలు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

You missed