ఇదేందీ.. పైన హెడ్డింగ్ చూసి ఇదేదో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం అనుకుంటున్నారా..?
కాదు…
మరి…
నేరుగా చేతికి చెక్కులందించడమేమిటి..? ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు … ఓకే… యోగ క్షేమాలు కూడా అడుగుతున్నారు ఓకే… మరి ఈ చెక్కులేంది… ఇంటికి వెళ్లి ఇచ్చుడేందీ..?
మాట్లాడితే మునుగోడు గుర్తొస్తున్నది అందరికీ. కొంచెం ఓపిక పట్టి ఇది చదివితే తెలుస్తది.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ధర్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఈ రోజు బాజిరెడ్డి జగన్ కలియతిరిగాడు. ఎందుకు..?
మామూలుగా కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్డిదారులంతా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికో.. ఎమ్మెల్యే ఇంటికో తిరుగుతూ ఉంటారు. మా చెక్కులొచ్చినయా ..? అని ఆరా తీస్తూ ఉంటారు. కానీ ఇక్కడ జగన్ తనే ఆ చెక్కులను అందించేందుకు వారి ఇంటికి వెళ్లాడు. అనుకోని అతిథి వచ్చినట్టుగానే చూశారు. ఆశ్చర్యపోయారు అక్కడి జనం. వారి యోగక్షేమాలు కనుక్కొని.. మీరు దరఖాస్తు చేసుకున్న కళ్యాణ లక్ష్మీ పథకం చెక్కు వచ్చిందమ్మా… తీసుకోండని వారి చేతికందించి తీపి కబురు చెప్పసరికి వారి మోములో ఆనందం వెళ్లివిరిసింది. ఎప్పుడొస్తాయో…? అని ఎదురుచూస్తున్న వారికి తీపికబురుతో .. డబ్బుల చెక్కుతో వచ్చిన నాయకుడిని చూసి మనసారా ఆశీర్వదించారు.