రాజగోపాల్ రెడ్డి…. డబ్బులు సంపాదించాడు. కానీ లీడర్‌గిరీ రాలేదు. నాయకత్వ లక్షణాలు అబ్బలేదు. నాయకుడంటే గ్రామాల వారీగా నాయకులను గుర్తు పెట్టుకోవాలి. వారిని పేర్లతో పిలవాలి. ఆప్యాయంగా పలకరించాలి. కానీ ఇక్కడ రాజగోపాల్ రెడ్డి విషయంలో రివర్స్. పట్టుమని పది మంది పేర్లు గుర్తుండవు. పదిసార్లు చూసిన ముఖం మళ్లీ కనిపిస్తే క్వశ్చన్ మార్కే అతని మోముపై దర్శనమిస్తుంది. ఇది నేనంటున్న మాట కాదు. మునుగోడు నియోజకవర్గంలో నడుస్తున్న డిస్కషన్. ఓ నలుగురు కలిసినా ఇప్పుడు ఇదే కదా టాపిక్. రాజగోపాల్ రెడ్డి ని ఓ అహంకారిగా చూస్తున్నారు చాలా మంది. సంపాదనతో వచ్చిన అహంకారిగా అతన్ని చూస్తున్నారు తప్పితే.. ఓ లీడర్‌గా మాత్రం చూడటం లేదు. మండలానికి ఓ పది మంది నాయకులను నోరారా పేరారా పిలిచే మెమరీ లేనోడు… నాయకుడెందుకవుతాడు. అందుకే అతను వ్యాపారవేత్త అయ్యాడు. కోట్లు సంపాదించాడు. కోట్ల కోసమే పార్టీ మారాడు. ఎన్నికలు తెచ్చాడు. ఇప్పుడిదీ అక్కడ జరుగుతున్న చర్చ.