కూరిమిగల దినములలో నేరములెన్నడు కలగనేరవు…. మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమితి….. బూర నర్సయ్య గౌడే కాదు.. చాలా మంది పరిస్తితి ఇదే. ఒక్కసారైనా వీళ్లకు పదవులొచ్చాయి. రెండోసారీ అవకాశం వచ్చింది. మరి ఒక్కసారి కూడా ఎలాంటి పదవి లేక… ఖర్చుకు రూపాయి ఆమ్దానీ లేక… పార్టీనే గబ్బిలాల్లా పట్టుకుని వేలాడుతున్న వారి పరిస్థితి ఏందో…. మరి. ఒక్కసారి ఎంపీ అయ్యావు. రెండోసారీ అవకాశం వచ్చింది. ఓడావు. మూడోసారీ ఎమ్మెల్యే కావాలంటివి.
అన్నీ నీకే పదవులు కావాలె.. మరి మిగిలిన వాళ్లు ఉద్యమం చేయలేదా..? పార్టీ పుట్టిన నాటి నుంచి లేరా..? వాళ్లలో బీసీలు లేరా..? నువ్వే బీసీవా..? నీకిస్తేనే బీసీలందరికీ న్యాయం చేసినట్టా…? మీదికెళ్లి మళ్లీ బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలు. ఇస్తావా..? పోవాలా..? దీనికి మేథావిననే బిల్డప్. ఈ సమయంలో పార్టీని వదిలి వెళ్తే .. బీజేపీలో చేరితే.. ఎంతిస్తా అన్నారు..? ఎంతకు అమ్ముడుపోయావు..? ఏ పదవులు కోరావు..? అని మీవోళ్లే మిమ్మల్ని ప్రశ్నించే ప్రమాదమూ లేకపోలేదు డాక్టర్ సాబ్…