ఆర్ధికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు, అగ్రకులాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నరేంద్ర మోడీ నేత్రత్వం లోని బిజెపి ప్రభుత్వం “103 వ రాజ్యాంగ సవరణ చట్టం -2019″తీసుకువచ్చిందని అది
రాజ్యాంగ స్పూర్తికి పూర్తి విరుద్ధమని
బహుజన లెఫ్ట్ ఫ్రంట్-బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ విమర్శించారు.

అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లపై
ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ రోడ్లు, భవనాలు అతిథి గృహంలో
బహుజన పొలిటికల్ సెంటర్ కమిటి ఆధ్వర్యంలో
జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దేశవ్యాప్తంగా బిసి సంఘాలు, ఇతర సామాజిక ఉత్తమ కార్యకర్తలు 40 పిటీషన్లు సుప్రీంకోర్టు లో వేశారని వెల్లడించారు.ఈ పిటిషన్లన్నింటినీ
ఈ నెల 13 వ తేదీ నుండి వారం రోజులపాటు ప్రత్యేక రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టిందని, ఈ నేపథ్యంలో ఈ చట్టం పై ప్రజలలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి సామాజిక ఉద్యమ కార్యకర్తలపై విధిగా ఉంటుందని ఆయన తెలిపారు.

ప్రముఖ న్యాయవాది బిసి ఉద్యమ నాయకులు బాస రాజేశ్వర్, బిఎల్ టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సిద్దిరాములు ,దళిత బహుజన ప్రజా సంఘాల జెఎసి చైర్మన్ సావెల్ గంగాధర్, బిఎల్ఎఫ్ జిల్లా కన్వీనర్ కె.మధు,బిఎల్ టీయు ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, బహుజన మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండు జ్యోతి, బిసి కులాల ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ జన్నేపల్లి సత్యనారాయణలు మాట్లాడుతూ ..  రాజ్యాంగం లోని ఆర్టికల్ 15,16 లలో సామాజికంగా,ఆర్ధికంగా వెనుకబడిన కులాలను,తెగలను ప్రతేక దృష్టితో అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని, వేల సంవత్సరాలుగా సామాజిక కుల అణచివేత కొనసాగిన ఈ దేశంలో ఈ సామాజిక అణచివేత.. ఆర్ధిక అణచివేతకు,  ఈ రెండు అణచివేతలు రాజకీయ అణచివేతకు గురిచేసాయని అమానుషమైన, దారుణమైన అణచివేతలకు గురికాబడిన SC,BC, ST లను ప్రతేక సదుపాయాలు కల్పించడం ద్వారా అగ్రవర్ణాలకు, అగ్రకులాలకు సమానంగా అభివృద్ధి చేయవచ్చన్న లక్ష్యంతో రిజర్వేషన్లు కల్పించబడ్డాయాని వెల్లడించారు.

అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధం. పైగా అలిండియా అగ్రవర్ణాల, ప్రాంతీయ అగ్రకులాల జనాభా కేవలం 15 శాతం. పదిహేను శాతం ప్రజలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే 85 శాతం ప్రజలకు ఎంతశాతం కేటాయించాలని వక్తలు ప్రశ్నించారు.
“జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని”బహుజన కులాలు ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నా పెడచెవిన పెడుతున్న ఈ అగ్రవర్ణ పాలకులు అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించడం సిగ్గుచేటని,అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించడం అంటే రిజర్వేషన్ల సారాన్ని దెబ్బతీసే కుటిల ఎత్తుగడదాగివున్నదని విమర్శించారు.
ఈ విధానానికి వ్యతిరేకంగా దళిత బహుజన ప్రజలు ఉద్యమించాలని రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది.
ఈ సమావేశంలో పాల్గొన్న వారు సయ్యద్, యాదయ్య, గోపినాథ్, విశ్వనాథ్,వసంత్,రాజులు పాల్గొన్నారు.

You missed