సోషల్ మీడియా లో ఏదిపడితే అది ప్రచారం చేసుకుంటున్నారు. ఏ ఒక్కటీ వదలడం లేదు. ఒక్కోసారి ఆ విమర్శలు దిగజారి మరీ పాతాళానికి పడిపోతున్నారు. రంధ్రాన్వేషణ చేయడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. ఈ విషయంలో బీజేపీ ముందు వరుసలో ఉన్నారు. కేటీఆర్ ఎడమకాలు బెణికితే రెస్ట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఇంట్లో ఉండే ఆఫీసు కార్యక్రమాలు చూసుకుంటున్నాడు. మొన్న పంద్రాగస్టుకు జెండా ఎగరవేయడానికి వచ్చాడు. డాక్టర్ సలహా మేరకు కుడిచేతిలో ఊతకర్ర పట్టుకుని ఈ వేడుకలకు హాజరయ్యాడు.
దీనిపై బీజేపీ శ్రేణులు సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. ఇదేందీ…? ఏ డాక్టర్ చెప్పాడు. ఎడమకాలికి కదా దెబ్బ తగిలింది. కుడిచేతిలో చేతికర్ర ఎందుకు పట్టుకున్నావు…? మరీ ఇంత యాక్షనా..? అంటూ ఎద్దేవా చేస్తూ కామెంట్లు పెట్టారు. ఓ రకంగా అసలు కేటీఆర్ కాలికి దెబ్బే తగలలేదని, ఇదంతా ఉత్తిదేననే విధంగా వీరి కామెంట్లు మరీ ఎబ్బెట్టుగా ఉన్నాయి. ఇది చూసి టీఆరెస్ సోషల్ మీడియా వారియర్లకు తిక్కరేగింది. వారూ అదే రేంజ్లో కౌంటర్లిచ్చారు. ఓసారి గూగుల్లో చూసుకోండ్రా భక్తులూ…! ఏ కాలికి దెబ్బతగిలితే ఏ చేతిలో కర్ర పట్టుకుంటారో… మీరూ మీ గుజ్జులేని మెదళ్లు…… అంటూ తిట్ల దండకమందుకున్నారు.