“మోహన్‌రెడ్డి పార్టీ మారిండు కదా…. మీ సంగతేందీ…? ఉంటరా.. పోతరా..?”
“పోయే టైమ్ వస్తే ఎవరూ ఉండరన్నా…. టైం కోసం ఎదురుచూస్తున్నాం..”
“ఇన్ని రోజులు ఓపిక పట్టినం.. చూస్తం ఇంక… ఆ తర్వాత మాకూ టైం వస్తది….”
“ఇచ్చినోడికి మూడు మూడు పదవులా అన్నా…… లేనోడిని అస్సలు పట్టించుకునుడే లేదు…. ఇదెక్కడన్యాయం…?”
“ఎవరికిచ్చిర్రు మూడు మూడు పదవులు…?”
“జీవన్‌రెడ్డికి మూడు పదవులు… జిల్లా అధ్యక్షుడంట…. పీయూసీ చైర్మన్ అంట… ఎమ్మెల్యే…..”
“కామారెడ్డిలో ముజీబ్‌కు మూడు పోస్టులు అవసరమా..? ముస్లింలే ఆయన మీద నారాజ్ ఉన్నరు… అయినోళ్లకు ఇట్ల అందలమెక్కిస్తరు…. ఉద్యమం నాటి నుంచి ఉన్న మాకు మాత్రం మొండి చెయ్యే అప్పట్నుంచి ఇప్పటి దాకా…”
“రోజు ఎంత మంది ఫోన్ చేస్తరో తెలుసా అన్నా…? వాళ్ల బాధలు వర్ణనాతీతం….”
“కడుపు నిండినోడికే పదవులు.. కార్యకర్తలకు, చిన్న లీడర్లను మాత్రం పట్టించుకున్నోడు లేడు…”
“ఎంత కాలం చూస్తరింక… వాడికి ఫ్యామిలీ లేదా..? కడుపు లేదా..? సమయం వచ్చినప్పుడు తెలుస్తది వీళ్లకు…”