ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి శ్రీ వేముల ప్రశాంత్  రెడ్డి స్పందన…

ప్రధాని పదవి అంటే గౌరవ ప్రదమైనది కానీ మోడీ అది మర్చి పోయి రోజూ వారి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడినట్లే మాట్లాడారు.

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించకుండా అడ్డం పడుతున్నది. అయినా నేడు తెలంగాణ కేసిఆర్ గారి నాయత్వములో అన్ని రంగాల్లో నెంబర్ వన్.

అందుకే దేశం ఇప్పుడు కేసిఆర్ నాయకత్వం కోరుకుంటుంది. తెలంగాణ లాగా మా రాష్ట్రాలు అభివృద్ధి కావాలి,అక్కడి సంక్షేమ కార్యక్రమాల ఫలాలు మాకు అందాలని దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలు బలంగా కాంక్షిస్తున్నరు.మీ అరాచకాలకు విసిగి పోయిన యావత్ దేశ ప్రజల పక్షాన బయలు దేరిండు కేసిఆర్.

అందుకే..ఇది మీకు మింగుడు పడటం లేదు. కేసిఆర్ భయం మొదలయింది. తెలంగాణ లో అధికార మార్పిడి కాదు ముందు మీ ఢిల్లీ పీఠం పైలం

కేసిఆర్ గారు సైన్స్ ను నమ్ముతాడు.దేవుణ్ణి నమ్ముతాడు,మొక్కుతాడు

సైన్స్: కాళేశ్వరం ప్రాజెక్టు
దైవం: యాదాద్రి టెంపుల్

మీ బీజేపీ లాగా ఓట్ల కోసమైతే దేవుణ్ణి వాడుకోడు.

తెలంగాణ రాష్ట్రం అంటేనే బీజేపీ మోడీ కి నరనరాన విద్వేషం.

తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని రాష్ట్ర ఏర్పాటు పై పార్లమెంట్ వేదికగా తెలంగాణ ప్రజలను అవమాన పర్చేలా మాట్లాడినప్పుడు ఎక్కడికి పోయింది తెలంగాణ పై నీ ప్రేమ..?

రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని లేకుంటే అప్పు ఇవ్వమని ఒత్తిడి తెచ్చినవ్.అయినా కేసిఆర్ ఒప్పుకోలేదు.

అందుకే కేసిఆర్ మీద పగ పెంచుకున్నారు.వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు.

తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలనే లెక్క చేయలేదు కేసిఆర్. ఇప్పుడు పచ్చ బడుతున్న తెలంగాణ మీద మీ కుట్రలను చూస్తూ ఊర్కుంటడా..?

అయినా…నీవు ఎన్ని చెప్పినా..

కేసిఆర్ అంటే తెలంగాణ…తెలంగాణ అంటే కెసిఅర్
దీనిపై తెలంగాణ ప్రజలకు అవగాహన ఉన్నది.

మీరు వస్తారు పోతారు.ఇక్కడ ఉండి తెలంగాణ బాగోగులు చూసుకునేది కేసిఆర్ మాత్రమే.

You missed