“పనిలేక ఇంట్లో సోమరిగా కూచునే పనికిమాలిన వాడు కూడా,వూళ్ళో జీతానికి వంట చేసేవాడు కుడా భార్యకి వండి పెట్టడు.
ఆమె యెంత తెలివైనదైనా సరే!”.
శాస్త్రాలలో భర్తకి భార్య సేవ చెయ్యాలని వుంది.
భార్యకి సేవ చెయ్యమని ఉందా!
దయగా కుక్కల్నీ,ఆవుల్నీ చూసినట్లు చూడమని వుంది.
పొలం మీద వచ్చే డబ్బు తినే ఈ సోమరి మొగవాళ్ళందరూ యేమిటి లోకంలో చేస్తున్న పని?భార్యకి వంట చేసి పెట్టరాదూ?
ఇల్లూడవలేరూ?పైగా ఒక్క భర్తకే గాక, తత్సంబంధమైన సోమరి పోతులందరికీ సేవ చేయాలి స్త్రీ.
వంట విషయమై నియోగింపబడిన, జీతం భత్యం లేని ఒక “స్త్రీ బానిస” సంఘంలో తేరగా పడిఉండటం వల్ల,యీ పురుషులకి రుచులెక్కువైనాయి.
వంటమనిషిని పెట్టుకోలేనంత బీదవాడికి కూడా,
దేవుడేర్పరచిన వంటమనిషి తయారుగా ఉందిగా!
యేం?హోటల్లో భోజనం చెయ్యలేడూ! “అమ్మా పెళ్ళామూ ఉండగా హోటల్లో భోజనం చేసే ఖర్మమేం నాకు” అంటాడు.
భార్య చచ్చిపోతే,”వండిపెట్టే దిక్కన్నా లేదం”టాడు.
భార్యల ఉపయోగం స్పష్టంగా తెలుస్తూనే ఉంది.
వీళ్ళే పెద్దబల్లల మీదయెక్కి భార్యా,గౌరవం,సహధర్మ చారిణీ అని ఉపన్యాసాలిచ్చేది.
#చలం స్త్రీ పుస్తకం నించి.
(Copied From: లక్ష్మీ వర్మ గారి fb పోస్ట్..)
— Rajeshwer Chelimela , Jvv Telangana