భగవద్గీత కూడా పరమతం వాన్ని ద్వేషించమని చెప్పదు… దేశంలో అన్ని రాష్ట్రాల్లో క‌రెంటు కోత‌లున్నాయి… తెలంగాణ‌లో ఎందుకు లేవు…?

– మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్:
దేశంలో గుజరాత్ తో సహా అన్ని రాష్ట్రాల్లో కరెంట్ కోతలు ఉన్నాయి కానీ కేసిఆర్ ముందు చూపు వల్ల నేడు తెలంగాణలో కరెంట్ కోతలు లేవన్నారు.జై శ్రీరామ్,భారత్ మతాకి జై అని నినాదాలు తప్పా అందుకు అచరనియమైన పనులు ఒక్కటీ చేయట్లేదని బీజేపీ నేతల వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి వేముల ప్ర‌శాంత్‌రెడ్డి. భగవద్గీత కూడా పరమతం వాన్ని ద్వేషించమని చెప్పలేదన్నారు.నిజమైన హైందవ ధర్మం అంటే దాన్ని రక్షించడమని,మాటలతో రెచ్చగొట్టడం కాదని హితవు పలికారు.బాల్కొండ నియోజకవర్గం లో తాను 50 గుడులు కట్టించానని,ఎంపి అరవింద్ ఒక్క గుడి కూడా ఎందుకు కట్టించలేదన్నారు. మాటకు ముందు తర్వాత జై శ్రీరాం మాటలు తప్పా…పనులు దానికి తగ్గట్టు లేవన్నారు.నిజమైన హైందవ ధర్మం కాపాడే వ్యక్తిగా కేసిఆర్ ను ఒప్పించి నియోజకవర్గంలో ఇల్లు కట్టించామని తెలిపారు.పనికిమాలిన రెచ్చగొట్టే మాటల్లో కాదు…అభివృద్ధిలో మాతో పోటీ పడండని మంత్రి వేముల బీజేపీ,కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు.

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం బాబాపూర్ గ్రామం మరియు ముచ్కూర్ గ్రామం బిజెపి,కాంగ్రెస్,బీఎస్పీ పార్టీ ల నుండి సుమారు 75 మంది సోమవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ముఖ్యమంత్రి కేసిఆర్ జనరంజక పాలన,సంక్షేమ కార్యక్రమాలు,నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకోవడం శుభాపరిణామమన్నారు మంత్రి.

బాల్కొండ నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు.వందల కోట్లతో సి.సి రోడ్లు,బి.టి రోడ్లు,సి.సి డ్రైన్స్,వైకుంఠ దామాలు,పల్లె ప్రకృతి వనాలు,ఇంటింటికీ సురక్షిత నల్లా నీరు,చెక్ డ్యాంల నిర్మాణం మీ కళ్ల ముందు కనిపిస్తున్నాయని అన్నారు.కొద్ది రోజుల్లో బాల్కొండ నియోజకవర్గం రైతాంగానికి ప్యాకేజీ 21 ద్వారా సాగు నీరు అందించనున్నట్లు తెలిపారు.

కేసిఆర్ నాయకత్వంలో కేవలం తెలంగాణ ప్రయోజనాల కోసమే పుట్టిన పార్టీ టిఆర్ఎస్ అని మంత్రి వేముల అన్నారు.ఇతర పార్టీలకు రాజకీయమే పరమావధని,టిఆర్ఎస్ పార్టీకి మాత్రం తెలంగాణ అభివృద్ధి అంటే ఆరాటం మన్నారు.తెచ్చుకున్న తెలంగాణ తలెత్తుకుని దేశం ముందు నిలబడేలా చేసింది టీఆర్ఎస్ పార్టీ అన్నారు.రాహుల్ గాంధీ,అమిత్ షా ఎవరైనా వారి పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేసి మాట్లాడాలన్నారు.వస్తారు..చాలా మాట్లాడి పోతారు.ఇక్కడి కంటే అక్కడ ఏ ఒక్క ఆదర్శ వంతమైన పథకమైన ఉందా అని ప్రశ్నించారు.బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు లేవని నిలదీశారు?.మీరు పాలించే రాష్ట్రాల్లో ఇవ్వరు కానీ తెలంగాణలో ఇస్తారంటే ప్రజలు నమ్మరని చెప్పారు. బీజేపీ,కాంగ్రెస్ పాలించే రాష్ట్రాల్లో లాగే తెలంగాణ ప్రజలు,రైతులు ఇబ్బందులు పడాలని కోరుకుంటున్నారా అని మండిపడ్డారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ధోన్కంటి నర్సయ్య,ఎంపిపి ఆర్మూర్ మహేష్,పార్టీ జనరల్ సెక్రటరీ షఫీ,బాబాపూర్ ఎంపిటిసి సుర్జీల్,సర్పంచ్ అతీక్,జిల్లా కో అప్షన్ మొయిజ్

సర్పంచ్ బండి శ్రీనివాస్,ఎంపీటీసీ రాజేశ్వర్,ఉపసర్పంచ్ భూమేష్,యూత్ ప్రెసిడెంట్ రమేష్,పార్టీ నాయకులు గాడి రాజు తదితరులు పాల్గొన్నారు.

You missed