పక్కా మాస్ డైలాగులు… లోకల్ లీడర్‌లా స్పీచు… అమిత్ షా ప్రసంగం ఆసాంతం.. పాత చింతకాయ పచ్చడిలాగే ఉంది. కొత్తదనం లేదు. దాదాపు రోజూ బండి సంజయ్ నోటి వెంట వచ్చే రోటీన్ డైలాగులే బట్టీ పట్టి… స్క్రిప్ట్ చదివి వినిపించినట్టుంది. స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందన్నాడు. కొడుకు, బిడ్డ కోసమే అన్నాడు. కేంద్ర పథకాలకు తన ఫోటోలు పెట్టుకుని పేర్లు మార్చకున్నాడన్నాడు. నిజాం పరిపాలనకు చరమగీతం పాడాలన్నాడు. తొక్కేయన్నాడు. విసిరేయాలన్నాడు. పాతరేయాలన్నాడు. జైళ్లకు పంపుతాతమన్నాడు. అవినీతి పేరుకుపోయిందన్నాడు. ఆఖరికి భారత్ మాతాకి జై అని ముగించాడు.
మధ్యలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే పదం తీసుకున్నాడు అమిత్ షా. తాము అధికారంలోకి వస్తే ఇవన్నీ చేస్తామన్నాడు. ఇంకా ఈ పాత నినాదమే బీజేపీ వాడుకోవడం విచిత్రం. ఇప్పటికీ ఇది వర్కవుట్ అవుతుందని భావించినట్టున్నారు. నీళ్లకు చింత లేదు. నిధులు కేంద్రమే ఇవ్వడం లేదని టీఆరెస్ రోజూ మొత్తుకుంటున్నది. నియమాకాలు మీరెన్ని చేశారో చెప్తారా..? అని కేంద్రాన్ని నిలదీసే పరిస్థితి ఉంది. ఈ వాతవారణంలో ఈ నినాదం బీజేపీకి ఏమాత్రం సూట్ కాలేదు. నమ్మశక్యం గా కూడా లేదు. స్క్రిప్ట్ ఎవరు రాశారో కానీ డైలాగులు పేలలేదు. ఆ హిందీ స్పీచు పాపం జనానికి కూడా పెద్దగా కనెక్టు కాలేదు. అనువాదకులు లేరో… అనువదించడం కన్నా అలా వదిలేడయమే మేలనుకున్నారో… హిందీలో సాగింది షా స్పీచు.
అంతకుముందు కిషన్‌రెడ్డి, ఆ తర్వాత బండి సంజయ్ స్పీచులు కూడా పేలలేదు. పంచ్‌లేమీ లేవు. పాతమాటలే. బండి సంజయ్ మాటలు దాదాపుగా ఎవరికీ అర్థం కూడా కాలేదు. ఆఖరికి ప్లీజ్..ప్లీజ్… ప్లీజ్ ఒక్కసారి అధికారం ఇయ్యండన్నా అని వేడుకోవడం అందరికీ కనెక్టయ్యింది. ఈ తరహా ఫార్మూలా పీకే ది. మరి పీకే నాడి బండి సంజయ్ కూడా పట్టినట్టున్నాడు.