నారాయణ చేసిన దారుణాల్లో పేరెంట్స్ వాటా సగం.

నారాయణ, చైతన్యల చదవకుంటే అది చదువే కాదన్నట్టు, అక్కడ అడ్మిషన్ దొరక్కుంటే ఇంకెందుకు పనికిరాడు అన్నట్టు,
మార్కులు వస్తే చాలు పిల్లల మనసుతో సంబంధం లేదన్నట్టు,
ర్యాంక్ వస్తే చాలు రాచి రంపాన పెట్టిన ఏంగాదన్నట్టు, ఆ కోళ్ల ఫారమే ప్రపంచమన్నట్టు..పోటీ పడ్డది మనం. సీట్ల కోసం ఫైరవీలు చేసి, లక్షల డబ్బులు పోసి వాళ్లను సాకింది మనం. ఇది నిలబెట్టుకునే ప్రయత్నంలో వాళ్లు చేయని దారుణాల్లేవు. మామూలు కాలేజీలను మింగేశారు. ఎందరు పిల్లలు ఆత్మ హత్యలు చేసుకున్నారో లెక్కేలేదు. ఫీజులు కట్టలేక అప్పుల పాలైన కుటుంబాలు ఎన్నో. ఐనా నారాయణ, చైతన్యలనే సీటు కావాలని సర్వం త్యాగం చేసింది మనం. ప్రభుత్వాలు కూడా వాళ్లకు సహకరించినవే. పేపర్ లీక్ కొత్త కాకున్నా..రాజకీయ కారణాలు ఉన్నా సరే అరెస్ట్ చేయడం కరెక్టే. ఇంత జరిగినా మన మమ్మీ డాడీలు మారరు గాక మారరు…😏

Raghu Bhuvanagiri

You missed