సరిగ్గా వారం కిందట…
వరంగల్ సభకు వచ్చిన ప్రతిపక్ష పార్టీ రాహుల్ గాంధీ..
2 లక్షల రుణమాఫీ
15 వేల రైతు పెట్టుబడి సాయం
15 వేలు కౌలు రైతులకు సాయం
12 వేలు భూమిలేని ఉపాధి హామీ రైతులకు
2500 వరికి ధర
2250 కందులకు..
అని తెలంగాణ రైతులకు హామీలిచ్చిండు. కాంగ్రెస్ గెలుస్తదా లేదా అన్నది వేరే పాయింట్.

ఇయ్యాల అధికార పార్టీ ముఖ్య నాయకుడు అమిత్ షా వచ్చి
రైతులకు అక్కెరొచ్చే ముచ్చట ఒక్కటన్న చెప్పిండా..? ఏమన్న హామీ ఇచ్చిండా…? భరోసా నింపిండా..? మొత్తం పొల్టికల్ పొంకనాలు.. అధికారం కోసం గప్పాలు.. ఎంఐఎం మతం అని రెచ్చగొట్టుడు.

అందుకే కమలం కంటే కాంగ్రెస్ చాలా చాలా బెటర్…

Raghu Bhuvanagiri

You missed