నారాయణ అరెస్ట్ ఉదంతంపై సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది. టీవీ డిబేట్లలో యాంకర్లు గొంతులు చించుకుంటున్నారు. ఎవడి మీడియా వాడిది. ఎవడి వాదన వాడిది. ఒకడికి అన్యాయం అయ్యింది.. మరొకటి న్యాయమనిపించింది. ఎవడి సొమ్ము తిన్న వాడు వాడి పాట పాడుతున్నాడు. మధ్యలో ప్రేక్షకుడు..వీక్షకుడు సదా.. షరా బక్రానే. సోషల్ మీడియాలో మాత్రం కొన్ని అభిప్రాయాలు ఆసక్తిగా, ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. అందులో ఒకటి…. బీజేపీలో చేరే ఆలోచన నారాయణకు ఎందుకు రాలేదో..? అని.
అవును.. ఈ మధ్య కేసులకు భయపడే వారంతా… అక్రమార్జనకు అలవాటు పడిన (అలవాటు పడనివారెవ్వరు..? ) వారంతా తమకు కేసులు, అరెస్టుల భయం ఉందనే అనుమానం రాగానే… వెంటనే గుర్తొచ్చేది బీజేపీ. ఒక ఈటల రాజేందర్, ఒక తీన్మార్ మల్లన్న… ఎట్సెట్రా. ఈ కోవలోనే నారాయణను కూడా తీసుకున్నారు. ఆయనకు పాపం ఎందుకు ఈ ఆలోచన రాలేదు..? వస్తే ఈ అరెస్టుల పర్వం ఉండకపోవు కదా…? అనే వెటకారం. అది వెటకారమే అయినా..అందులో నిజం లేకపోలేదు. తను అధికారంలో ఉన్నప్పుడు విద్యావ్యవస్థను ఓ వ్యాపారం రాజ్యంగా మార్చుకుని పిల్లలను పెట్టుబడిగా పెట్టి కోట్లకు పడగలెత్తిన నారాయణకు , చంద్రబాబుకు ఆ పాపం ఏనాటికైనా పండకపోతుందా అని గుర్తెరగకపోవడమే విషాదం…