మోడీకి భ‌య‌ప‌డి ఏపీలో క‌రెంటు మోటార్ల‌కు మీట‌ర్లు.. ఇక్క‌డ కేసీఆర్ మీట‌ర్లు పెట్టే ప్ర‌సక్తే లేద‌ని తెగేసి చెప్పారు…

– మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్:

పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో మోడీ కి భయపడి కరెంట్ మోటర్లకు మీటర్లు పెడుతున్నారని మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఏది ఏమైనా తెలంగాణ రైతుల ప్రయోజనాలే ముఖ్యమని, మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని కేంద్రానికి తెగేసి చెప్పారన్నారు.

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోర మండలం దూదిగాం గ్రామం నుంచి బీజేపీ పార్టీకి చెందిన యువకులు మంగళవారం హైదరాబాద్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (RDC) ఛైర్మన్ మెట్టు శ్రీనివాస్ తో కలిసి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ…

ముఖ్యమంత్రి కేసిఆర్ జనరంజక పాలన నచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరిన బాల్కొండ నియోజకవర్గం దూదిగాం గ్రామ యువకులకు మంత్రి స్వాగతం పలికారు.ఇక నుండి మీరు టిఆర్ఎస్ కుటుంబ సభ్యులని అన్ని విధాల పార్టీ అండగా ఉంటుందన్నారు.బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి మీ కళ్ళ ముందే కనిపిస్తోందన్నారు.సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు ధీటుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి,దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేవన్నారు.