టీఆరెస్ సోష‌ల్ మీడియా ఈ మ‌ధ్య హుషారైంది. త్రిపుల్ ఆర్ సినిమా ఇలా విడుద‌లైందో లేదో.. అందులో సినిమా చివ‌ర‌లో వ‌చ్చే ఫేమ‌స్ పాట‌ను ప‌ట్టేసుకున్నారు. ప‌రాయి పాల‌న‌పై కాలుదువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్త‌ల్లాంటి అమ‌ర‌వీరుల‌ను త‌లుచుకుంటూ రాసిన పాట‌. మాంచి ఊపున్న పాట‌. అందులో పాట మ‌ధ్య‌లో సిరిగ‌ల్ల కోడె సిరిసిల్ల కోడె అని తెలంగాణ‌కు స‌బంధించిన యోధుల‌ను త‌లుచుకునే సంద‌ర్బాన్ని కేటీఆర్‌ను అన్వ‌యించారు. సిరిసిల్ల నంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కేటీఆర్‌కు ఇది స‌రిగ్గా నప్పుతుంద‌నే మంచి వీడియో ఒక‌టి ఫ్రేమ్ చేసి దానికి ఈ పాట‌ను జోడించి అలా త‌మ క్రియేటివిటిని వాడి సోష‌ల్ మీడియాలో వ‌దిలారు. ఇప్పుడిది వైర‌ల్ అయ్యింది.

https://www.facebook.com/100003960280522/posts/2375034175971902/

You missed