తెలంగాణ లో సెలవులు ..
ఏపీ లో క్లాసులు ???
ఆరు నుంచి పది లక్షల కేసులు ఉన్న అమెరికా లో విద్య సంస్థలు పని చేస్తున్నాయి . రెండు నుంచి మూడు లక్షల కేసులున్న ఫ్రాన్స్ , ఇంగ్లాండ్ లాంటి యురోపియన్ దేశాల్లో కూడా విద్య సంస్థలను మూయ లేదు .
దీనికి కారణం .
1 . చదువు ప్రాధాన్యత ఆ దేశాలకు బాగా తెలుసు . ఆన్లైన్ వల్ల పరిమిత ఉపయోగం అని వారికి తెలుసు . 2 . ప్రారంభం నుంచి కూడా కరోనా పిల్లల పై ప్రభావం బాగా తక్కువగా చూపుతోందని అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు , డాక్టర్ లు చెప్పారు .
కానీ మన దేశం లో పరిస్థితి వేరు .. కరోనా మూడో వేవ్ పిల్లలకే సోకనుందని గత ఆరునెలలుగా బూటకపు ప్రచారం హోరెత్తింది . ఓమిక్రాన్ వల్ల పిలల్లు కాదు కదా కనీసం పెద్దలు కూడా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేని స్థితి నేడు కనిపిస్తోంది
. పోనీ ఓమిక్రాన్ నెలకో రెండు నెలలకో పోతుందా అంటే లేదు… అది ఎండెమిక్ అవుతుంది . అంటే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతుంది . అంటే ఓమిక్రాన్ కు భయపడి విద్యాసంస్థల్ని మూసేయాల్సి వస్తే అది నెలకో సంవత్సరానికో పరిమితం కాదు . వందేళ్లు లేదా అంత కంటే ఎక్కువ కాలం మోసేయ్యాలి . మూసేద్దామా ?
బహుశా తల్లి తండ్రుల్లో ఉన్న భయాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం సెలవుల్ని జనవరి చివరి దాక పొడిగిసూ నిర్ణయం తీసుకొంది.
కరోనా మొదటి వేవ్ రెండో వేవ్ ల మధ్య పాఠశాలల్ని నడిపిన ఒకే ఒక రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ . ఇప్పుడు కూడా సెలవుల్ని పొడిగించకుండా రేపటి నుంచి అంటే 17 జనవరి నుంచి పాఠశాలల్ని పునః ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి . అది జరిగితే నిజం గా అది గొప్ప నిర్ణయం అవుతుంది .
మీరు పాఠశాలల్ని నడుపుతున్నారు కాబట్టి మీరు ఆలా చెబుతున్నారు అని ఎవరైనా చెప్పవచ్చు . దీనికి సంబంధించి రెండు అంశాలు .
1 . మేము ఆన్లైన్ క్లాసులు , భౌతిక తరగతులు రెండూ నిర్వహించాము . ఆన్లైన్ కావాలో పిల్లల్ని స్కూల్ కు పంపాలో నిర్ణయించుకునే అవకాశాన్ని తల్లితండ్రులకే వదిలేసాము . 2 నిజానికి రెండు నిర్వహించాలి అంటే ఖర్చులు , పని భారం మోయలేని విధంగా వుంది . నేను కేవలం మేనేజ్మెంట్ కోణం నుంచి ఆలోచిస్తే ఈ నెలాఖరు దాక ఏంటి ఈ అకాడమిక్ ఇయర్ చివరి దాక ఆన్లైన్ అన్నా సంతోషమే .
మనిషి గా ఈ భూమిపై పుట్టినందుకు, పిల్లల జీవితాల్ని తీర్చిదిద్దే అవకాశం వచ్చినందుకు . ఒక విషయాన్ని చెప్పాలి . పిల్లల్ని ఎన్ని రోజులు పాఠశాలకు దూరం చేస్తే అంత నష్టం . నష్టం పాఠశాల యాజమాన్యాలకు కాదు . పిల్లలకు .. వారి తల్లి తండ్రులకు .. పిల్లల బాల్యం , వారి బతుకు ఇప్పటికే నాశనం అయ్యింది . ఓమిక్రాన్ వచ్చాక కూడా పాఠశాలలు మూయడం సరి కాదు .
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్ని తెరవాలి అని నిర్ణయిస్తే నా అభినందనలు . కేసులకు భయపడి పిల్లల్ని పాటశాలకు పంపడానికి జంకుతున్న తల్లి తండ్రులకు ఆన్లైన్ చదువు మరి కొంత కాలం కొన సాగించవచ్చు . ఎవరి పైనా ఒత్తిడి వద్దు. అదే సమయం లో జనాలకు వాస్తవాలు చెప్పాలి . భయాన్ని వ్యాపింప చేసి వారి జీవితాల్ని నాశనం చెయ్యాలని చూస్తున్న వారి బాగోతాన్ని బహిర్గతం చెయ్యాలి . ఇది రాజకీయ సమస్య కాదు . విద్య సంస్థల విషయాన్ని అందరూ రాజకీయాలకు అతీతం గా చూడాలని విన్నపం .
ఇక తెలంగాణ విషయానికి వస్తే .. ఫిబ్రవరి మొదటి వారం నుంచైనా భౌతిక తరగతులు ప్రారంభించాలి . అప్పటిదాకా అంటే జనవరి 30 దాక ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలి అకాడమిక్ ఇయర్ ను మే నెల దాక పొడిగించాలి . పిల్లల చదువు దెబ్బ తినకుండా చూసుకోవాలి .
నేటి బాలలే రేపటి మన భవిత . బాల్యాన్ని కాపాడండి . తల్లి తండ్రుల్లో అవగాహన తీసుకొని రావాలి. నిర్ణయం వారికే వదిలెయ్యాలి .
సర్వే జనా సుఖినోభవంతు
(Amarnath Vasireddy)