నేడు కరోనా కొత్త రకం అంటే ఓమిక్రాన్ విస్తరిస్తోంది .

ఇది సోకితే వుండే లక్షణాలు లక్షణాలు :1 జలుబు ,2. గొంతు గరగర , పొడిదగ్గు , 3 ఒంట్లో కొద్ది పాటినలకడ .4 ఒకటి రెండు రోజులు జ్వరం .

చేయాల్సినవి : 1 వారం రోజుల పాటు వేడి నీటిని తాగండి . రోజుకు నాలుగు లీటర్ లు – పెద్దలు ; పిలల్లు – రెండు లీటర్లు .
2. వేడి నీటిలో ఉప్పు వేసుకొని గార్గిల్ చెయ్యడం ;
3 . బి, సి , డి విటమిన్ మాత్రలు జింక్ మాత్రలు వారం పాటు తీసుకోవడం .
4 . అల్లం పసుపు కషాయాన్ని రెండు మూడు రోజుల పాటు తీసుకోవడం . { చాలా కొద్దిగా .. టీ తాగినట్టు.. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు }
5 షుగర్ వ్యాధి లేని వారు రోజుకు ఒక అరటిపండు , అందరూ పాల కూర , నానపెట్టిన బాదాం – వారం పాటు తీసుకొంటే మంచిది .
6. ఎందుకైనా మంచిది – పల్స్ ఆక్సీ మీటర్ లో ఆక్సిజన్ చూసుకోవడం . అది 94 కంటే ఎక్కువ ఉండాలి ..
7 . జ్వరం ఉంటే డోలో 650

ఎప్పుడు ఆసుపత్రికి వెళ్ళాలి ?

1. అయిదు రోజులకు కూడా జ్వరం తగ్గక పొతే ; 2 . ఆక్సిజన్ శాతం 92 దాటి ఇంకా కిందకు పడిపోతుంటే .

అవసరం లేనివి :

కరోనా అవునా కాదో తెలుసు కోవడానికి టెస్ట్ చేసుకోవడం , HRCT అంటే స్కానింగ్ చేయించుకోవడం ,

కీడు చేసేవి :

భయపడడం , పైన చెప్పినవి కాకుండా ఇతరత్రా మాత్రలు ముఖ్యంగా మాలనుపైరవీర్ మాత్రలు, స్టెరాయిడ్ మాత్రలు ఇంజక్షన్ లు తీసుకోవడం – ఇవి చేస్తే మీ ఆరోగ్యం దారుణంగా దెబ్బతిని పోతుంది .

ఇది వేగంగా విస్తరిస్తుంది . కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఈ లక్షణాలు వున్నాయంటే ఇక అందరికీ సోకినట్టే .. కాబట్టి లక్షణాలు ఉన్న వారు ఒక రూమ్ లో ఐసోలేటె కావడం లాంటివి అక్కర లేదు . గర్భిణీ లు , చంటి పిల్లలు పాలిచ్చే తల్లులు ఇలాంటి వారి గురించి ఎటువంటి భయం వద్దు . ప్రత్యేక జాగ్రత్తలు అవసరం లేదు .

ఇది ఎవరికి డేంజర్? గతం లో ఒక సారి సోకిన వారికి దీనితో ఎలాంటి సమస్య లేదు . వారు వాక్సిన్ వేసుకున్నా వేసుకోకున్నా ఎలాంటి సమస్య లేదు . గతం లో సోకకుండా తప్పించుకున్న వారు వాక్సిన్ వేసుకొని ఉంటే కూడా దీనితో సమస్య లేదు . గతం లో సోకకుండా వాక్సిన్ వేసుకోకుండా ఉన్న వారు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి . వారి సహజ ఇమ్మ్యూనిటి బలహీనంగా ఉంటే వారికి దీనితో సమస్యలు రావొచ్చు .

తెలియని వారికి తెలియచెప్పండి . అనవసరంగా టెస్టింగ్ కేంద్రాలకు వెళ్లి డబ్బు తగలేసుకొంటున్నారు .కొన్ని మాత్రలు తిని కాన్సర్ ముప్పు తెచ్చుకొంటున్నారు . సెకండ్ వేవ్ తరువాత బ్లాక్ ఫంగస్ వచ్చింది . కారణం స్టెరాయిడ్ లు . ఇప్పుడు కాన్సర్ వస్తుంది . కారణం కొన్ని మాత్రలు . ఈ మెసేజ్ ని షేర్ చేయండి .

హ్యాపీ గా వుండండి . ఆలా బతకడానికి మిగతా వారికి కూడా అవహగాహన కల్పించండి . వేల మంది కోరి కోరి డబ్బును , ఆరోగ్యాన్ని నాశనం చేసుకొంటున్నారు

(Amarnath Vasireddy..)