“Sri Mahender Reddy Garu
గౌరవ Telangana DGP గారికి,

సర్..

సోషల్ మీడియా సోదరుల మీద వరుస దాడులు, అరెస్టులు జరుగుతున్నాయి..
దాదాపు 50 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వింటున్నాం..
అయితే కొందరిని కొడుతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి..
అదుపులోకి తీసుకున్నవారు ఏ పోలిస్ స్టేషన్ లో ఉన్నారో కూడా తెలియడం లేదు..
దయచేసి పోలీసులు సంయమనం పాటించాల్సిందిగా కోరుతున్నాను..

ప్రజాస్వామ్యంలో ప్రతీ పౌరుడికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది..
అయితే అది దురదృష్టవశాత్తు మీడియా స్వేచ్ఛ పేరుతో కొంతశాతం దుర్వినియోగం అవుతున్న మాట వాస్తవం..

ముఖ్యంగా సోషల్ మీడియాలో తెలిసీ తెలియని కొందరు యువకులు వ్యూస్ కోసం తప్పుడు తంబ్ నెయిల్స్ పెట్టడం ఇక్కడ సమస్యగా మారింది. ఇది జర్నలిస్టులు చేస్తున్న తప్పు కాదు..

పత్రికలు.. టీవీ ఛానెళ్లు పాటించే క్రమశిక్షణ, సంయమనం సోషల్ మీడియాలో లేదు..ఒప్పుకుంటున్నాం.. అయితే అదే సమయంలో పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం కరెక్టు కాదు.. అమాయకులైన జర్నలిస్టుల మీద దాడులు సమంజసం కాదు.. దయచేసి వారిని వెంటనే విడుదల చేయండి..

ఇలాంటివి జరిగినప్పుడు మొదట హెచ్చరించండి..
నోటీసులు ఇవ్వండి..
తీరు మార్చుకోకపోతే కేసులు పెట్టండి..
అంతేకానీ దయచేసి కొట్టకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాం..
అలాగే అరెస్టు చేసిన వారిని బేషరుతుగా విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాం…

Burra Srinivas
President
Telangana union of online working journalists -TUOWJ”